సాక్షి పత్రికకు, టీవీకి ప్రకటనలు నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుపై రాష్ట్ర హైకోర్టు కొద్దిసేపటిక్రితం (గురువారం) స్టే విధించింది. 'సాక్షి' కి వ్యతిరేకంగా సర్కారు జారీ చేసిన 2097 జీవోను సస్పెన్షన్ లో ఉంచింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి వచ్చే నెల 16 వరకు గడువు ఇచ్చింది. ఇది జగన్ కు కొంచెం ఉపశమనం ఇచ్చేవార్తయినప్పటికీ ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోన్న తాజా పరిణామాలు.. సిబిఐ, ప్రభుత్వ చర్యలతో జగన్ కు దిమ్మతిరిగిపోతోంది. తాజాగా జగన్ మీడియా ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై బుధవారం రాత్రి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతకం చేశారు. దీనిని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి పంపించారు. నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాత్రి పొద్దు పోయిన తర్వాత ఈ ఫైలుపై సంతకం చేసేశారు. దీనికి సంబంధించిన అటాచ్ మెంట్ జీవో ఇవాళ కొద్ది సేపటిక్రితమే వెలువడింది. దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు మీకోసం..
1944 క్రిమినల్ లా అటాచ్ మెంట్ ఆర్డినెన్స్... చాలా శక్తివంతమైన ఈ ఆర్డినెన్స్ ప్రత్యేక కేసుల్లో మాత్రమే వినియోగిస్తారు. కొన్ని కేసుల్లో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు.. తమ ఆస్తులను ఇతరులకు బదిలీ చేయడం.. షేర్లను అమ్మివేయడం లాంటి కార్యకలాపాలకు అవకాశం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన శాసనం.. 1935చట్టంలోని ఈ ఆర్డినెన్స్ ని 9వ షెడ్యుల్ లో చేర్చారు. దీని ద్వారా నేరం నిర్ధారణ అయిన వ్యక్తి తన ఆస్తులను ఇతరులకు బదిలీ చేయడం.. అమ్మివేయడం లాంటివి చేయకుండా నిరోధించవచ్చు. ఈ ఆర్డినెన్స్.. జమ్ము కశ్మీర్ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఇతర దేశాల్లో నివసించే భారతీయ పౌరులకు కూడా ఆర్డినెన్స్ వర్తిస్తుంది.
1944 క్రిమినల్ లా అటాచ్ మెంట్ ఆర్డినెన్స్ ఎలా పనిచేస్తుందో ఓసారి పరికిస్తే.. ఒక వ్యక్తిపైన, సంస్థపైనైనా విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థ ఆ వ్యక్తికి, సంస్థలోకి కాని అక్రమ పెట్టుబడులు వచ్చాయని నిర్దారిస్తే, ప్రభుత్వ అనుమతితో ఆస్తులు స్వాధీన పరుచుకుని కోర్టుకు స్వాధీనం చేస్తుంది. అక్రమంగా వచ్చిన పెట్టుబడులను ఇతర ఖాతాల్లోకి మార్చకుండా ఉండేందుకు దర్యాప్తు సంస్థ ఈ విధంగా వ్యవహరిస్తుంది. అయితే ఆస్తులను స్వాధీనం చేసుకున్న కోర్టు ఆ సంస్థ కార్యకలాపాలన్నీ తన పర్యవేక్షణలోనే జరపాలని ఆదేశిస్తుంది. ఇందుకోసం పర్యవేక్షణ అధికారులను నియమిస్తుంది. వారిని రిసీవర్స్ అంటారు.
ఆస్తులన్నీ కోర్టుకు స్వాధీనం చేయడం వల్ల ఆ సంస్ధ కార్యకలాపాలు కొనసాగుతాయి. కాని షేర్ల బదలాయింపు, షేర్ల అమ్మకాలు మాత్రం పూర్తిగా నిలిచిపోతాయి. ఆస్తులను కోర్టుకు స్వాధీనం చేసిన సమయంలో ఉన్న షేర్లు, వాటాదారులు అలాగే కొనసాగుతారు. ఆస్తుల డిపాజిట్ ద్వారా సంస్థ స్వతంత్రంగా వ్యవరించే అవకాశాన్ని కోల్పోతుంది. ఏ పనైనా కోర్టు నియమించిన పర్యవేక్షణ అధికారుల అనుమతితోనే చేయాలి. కోర్టు పర్యవేక్షణలోనే రోజువారీ కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ క్రయ, విక్రయాలు పూర్తిగా ఆగిపోతాయి. అయితే కోర్టుకు ఆస్తుల డిపాజిట్ చేయడం ద్వారా ఒక వెసలుబాటు కూడా ఉంది.
డిపాజిట్ చేసినపుడు ఎంత ఆస్తి, షేర్లు ఉన్నాయో.. కోర్టు తిరిగి సంస్థకు ఇచ్చే టప్పుడు ఆస్తి విలువ మారదు. ఒకవేళ సంస్థ ఆస్తుల డిపాజిట్ ను కోర్టు నుంచి వెనక్కి తీసుకోవాలంటే అంతే విలువ కలిగిన ఆస్తిని కోర్టుకు సెక్యురిటీగా పెట్టొచ్చు. ఇది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కోర్టు సెక్యురిటీ పెట్టి ఆస్తులను వెనక్కి తీసుకోవచ్చని కోర్టు అనుతిస్తేనే ఈ వెసలుబాటు ఉంటుంది. సెక్యురిటీ విషయంలో దర్యాప్తు సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసినా కోర్టు అనుమతివ్వకపోవచ్చు. శరవేగంగా మారుతోన్న పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణంలో ఏ ఉపద్రవం వస్తుందో అని జగన్ పార్టీ నేతలు సైతం మదనపడుతున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more