Us president obama assets valued at 8 million dollars

Barack Obama, Obama assets, US President

US President Barack Obama`s estimated assets for the last year are valued at USD eight million, his latest annual financial disclosure forms show

US President Obama assets valued at 8 million dollars.GIF

Posted: 05/17/2012 04:49 PM IST
Us president obama assets valued at 8 million dollars

Obamaఅమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆస్తులు ఎంత ? అంటే మన రాష్ట్రంలో అక్రమంగా లక్ష కోట్లు సంపాదించిన జగన్ ఆస్తులలో 0.2 శాతం. అంటే దాదాపు 80 లక్షల డాలర్లు. మన కరెన్సీలో (రూ.43.01 కోట్లు). ఈ ఆస్తుల జాబితా గత ఏడాది చివరి నాటికి అని ఆయన ఆర్థిక నివేదికలో తేలింది. ఇందులో దాదాపు 10 లక్షల డాలర్లు (రూ.5.37 కోట్లు) వివాదాస్పదమైన జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంకులో ఉన్నాయి. జేపీ మోర్గాన్ చేజ్ ప్రస్తుతం ఎఫ్‌బీఐ దర్యాప్తును ఎదుర్కొంటోంది. పెట్టుబడుల్లో అవకతవకల కారణంగా జేపీ మోర్గాన్ చేజ్ దాదాపు 200 కోట్ల డాలర్లు (రూ.10,752 కోట్లు) నష్టపోయినట్లు గతవారం వెలుగులోకి రావడంతో ఎఫ్‌బీఐ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది.

అయితే, అత్యుత్తమ నిర్వహణ సామర్థ్యం గల బ్యాంకుల్లో ఒకటిగా పరిగణించి, ఒబామా తన సొమ్మును ఇందులో భద్రపరచుకోవడం గమనార్హం. కాగా, షికాగోలోని ఇంటి కోసం ఒబామా 5 లక్షల డాలర్లు (రూ.2.68 కోట్లు) రుణంగా పొందారు. ముప్పయ్యేళ్లలో తీర్చవలసిన ఈ రుణంపై ఆయన 5.625 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఆయన దీనిని తేలికగా రీఫైనాన్స్ చేసుకునే వీలుందని, అలా చేసినట్లయితే, ఆయన ఇంటి రుణంపై చెల్లించాల్సిన వడ్డీ 4 శాతానికి తగ్గే అవకాశాలు ఉన్నాయని వార్షిక ఆర్థిక నివేదికలో వెల్లడైంది.

ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా పేరున్న అమెరికా అధ్యక్షుడికే 43.01 కోట్లు ఉన్నాయి. కానీ ఏ అధికారం లేకుండా తండ్రి పేరు చెప్పుకొని జగన్ లక్షకోట్లు సంపాదించడం విడ్డూరమే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Attachment go for sakshi media
Start my web  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles