Jr ntr clarifies about

jr ntr clarifies about...

jr ntr clarifies about...

16.gif

Posted: 05/13/2012 03:55 PM IST
Jr ntr clarifies about

       ‘దమ్ము’ సినిమా డైలాగుల అనంతరం నందమూరి ఫ్యామిలీలోనేకాదు.. వారి అభిమానుల్లోనూ  కొత్త వాదాలు తెరపైకొస్తున్నాయి. ఈ తరుణంలో జూనియర్ స్పందించారు.  'నాకు రాజకీయాలు తెలియవు! రాజకీయాల్లోకి వస్తానో, రానో కూడా తెలియదు. ఎన్టీఆర్ నాకు ఆదర్శం. ఆయన పెట్టిన పార్టీ పక్షానే ఉంటాను! ఒక నిర్ణయం తీసుకుంటే... చనిపోయేదాకా దానికి కట్టుబడి ఉంటాను'...nt ఇది జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాట! "సినిమా నా బతుకు తెరువు... తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి ప్రచారం చేయడం నా బాధ్యత అని 2009లోనే చెప్పాను.స్పష్టమైన వైఖరి తీసుకునే అప్పుడు ప్రచారంలోకి వచ్చాను. ఇప్పుడు నా వయసు 28 సంవత్సరాలు. మరో పాతికేళ్ల తర్వాతో, ఎన్నేళ్ల తర్వాతో... రాజకీయాల్లోకి వస్తానో, రానో నాకు తెలియదు. ఇప్పటి నుంచే నాకు రాజకీయాలు ఆపాదించడం తగదు. నాకు నిజంగా రాజకీయాలు తెలియవు'' అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఇటీవల విజయవాడలో వైఎస్ జగన్, టీడీపీ నేత వల్లభనేని వంశీ కరచాలనం, ఆలింగనం సంఘటనలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. "నా ప్రమేయం లేకుండా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఏదీ లేకుండా... ఆ ఇన్సిడెంట్‌ను నాకు ఆపాదించారు.  కొంతమంది గిట్టని వాళ్లు చేసే ప్రతిదానిపైనా స్పందించలేను. మళ్లీ మళ్లీ విడమరచి చెప్పలేను అన్నారు జూనియర్ ఎన్టీఆర్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi eagle eye ib sakshi employees
Kurnool jatara after 72 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles