End factionalism wary sonia tells congressmen

End factionalism, wary Sonia tells Congressmen,Sonia Gandhi mostly ‘mum’ on UP defeat,Sonia Gandhi,Congress party workers,Congress

End factionalism, wary Sonia tells Congressmen

Sonia.gif

Posted: 05/10/2012 10:20 AM IST
End factionalism wary sonia tells congressmen

 End factionalism, wary Sonia tells Congressmen

శతాబ్దాల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెడతోవ పడుతుండడంతో అధినేత సోనియా గాంధీ కొరడా ఝుళిపించారు. కఠినమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ క్రమశిక్షణరాహిత్యాని ఉపేక్షించమని పార్లమెంటు సభ్యులకు హెచ్చరికలు పంపారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పార్టీని ఇబ్బందుల పాలు చేయడం ఫ్యాషన్‌గా మారిందని చురకలేశారు.  ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించకపోవటం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. త్వరలోనే జరుగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి, ఐదు రాష్ట్రాల్లో పరాజయం నుండి గుణ పాఠం నేర్చుకోవాలని ఆమె సూచించారు.

సోనియా గాంధీ పార్లమెంటు సెంట్రల్ హాల్‌లోజరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అధ్యక్షోపన్యాసం ఇస్తూ మనం చేయవలసింది ఇంకా ఎంతో ఉన్నదని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయినా పార్టీ ఓట్ల శాతం బాగా పెరిగిందని వ్యాఖ్యానించారు. గత 22 ఏళ్లలో యుపిలో ఎక్కువ ఓట్లు సంపాదించి పార్టీ ప్రాధాన్యత సంతరించుకున్నదని ఆమె ప్రశంసించారు. అయితే ఇతర రాష్ట్రాల మాదిరిగా అక్కడ కూడా మనం ఎంతో పని చేయవలసి ఉన్నదని ఆమె సూచించారు. యుపి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై రక్షణ మంత్రి ఆంటోని నివేదిక ఇచ్చిన అనంతరం జరిగిన సిపిపి సమావేశంలో పార్టీ పరాజయం, దాని పరిణామాలపై సోనియా గాంధీ మాట్లాడటం గమనార్హం.  ఇటువంటివి పార్టీ ఉపేక్షించదని సొంత ఎంపీలకు అక్షింతలు వేశారు. పార్టీలో లోపించిన క్రమశిక్షణపై దృష్టిసారించి, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషిచేయాలని ఆదేశించారు. ముఠాలు కట్టవద్దని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఆర్థిక కష్టాల్లో కూడా పార్టీ సాధించిన విజయాలను ప్రజల్లోకితీసుకువెళ్లమని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex telecom minister a raja applies for bail
Violence against women act  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles