Ex telecom minister a raja applies for bail

Ex-telecom minister A Raja applies for bail,Siddharth Behura,RK Chandolia,A Raja Bail Application,A Raja,2G scam

Ex-telecom minister A Raja applies for bail

Raja.gif

Posted: 05/10/2012 11:44 AM IST
Ex telecom minister a raja applies for bail

Ex-telecom minister A Raja applies for bail

2-జి స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో నిందితుడు, మాజీ టెలికాం మంత్రి ఎ రాజా బెయిలు కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసు తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగా మోపినదని, అందువల్ల తనకు బెయిలు మంజూరు చేయాలని రాజా ఆ పిటిషన్‌లో కోరారు. ఇదే కేసులో సుప్రీంకోర్టు టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురాకు బెయిలు మంజూరు చేసిన వెంటనే రాజా తన బెయిలు పిటిషన్‌ను దాఖలు చేసారు. గత ఏడాది ఫిబ్రవరి 2న స్పెక్ట్రమ్ కేసులో అరెస్టయినప్పటినుంచి రాజా జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో తన సహ నిందితులందరికీ ఇప్పటికే బెయిలు లభించిందని, అందువల్ల సమన్యాయాన్ని పాటిస్తూ తనకు కూడా బెయిలు మంజూరు చేయాలని రాజా సిబిఐ ప్రత్యేక జడ్జి ఒపి సైని కోర్టును కోరారు. కాగా, రాజా బెయిలు పిటిషన్‌పై కోర్టు సిబిఐకి నోటీసు జారీ చేస్తూ దీనిపై తన సమాధానాన్ని ఈ నెల 11లోగా తెలియజేయాలని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  By elections in andhra pradesh crucial for congress
End factionalism wary sonia tells congressmen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles