Chandrababu naidu all free polices

Chandrababu Naidu' All Free' Polices,. president N Chandrababu Naidu promised free education from KG to PG for all children.

Chandrababu Naidu' All Free' Polices

Chandrababu.gif

Posted: 05/09/2012 12:56 PM IST
Chandrababu naidu all free polices

Chandrababu Naidu' All Free' Polices

కేవలం కొన్ని ‘ఉచిత’ హామీలకు బాబు పరిమితం కాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేదాకా వెయ్యి రూపాయల భృతి, వికలాంగులకు వెయ్యి రూపాయల పెన్షన్‌తోపాటు వృద్ధులకు ఇప్పుడు ఇస్తున్న 200 రూపాయల పింఛన్‌ను 500 రూపాయలు పెంచుతామని కూడా హామీ ఇచ్చేశారు. తాము అధికారంలోకి వస్తే బియ్యం, స్థలం, లక్ష రూపాయల విలువచేసే ఇల్లు, పేదపిల్లలకు చదువు, తొమ్మిది గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. గుంటూరులో జిల్లాలోని మాచర్ల, ప్రత్తిపాడు ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం నాగార్జునసాగర్ మీదుగా మాచర్ల విచ్చేసిన బాబు... పట్టణంలో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించారు. ఎలా ఇస్తారనడానికి బాబు ఒక లాజిక్ కూడా చెప్పారు.

తొమ్మిదేళ్లపాటు తాము చేపట్టిన సంస్కరణల మూలంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది... అయితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ సొమ్మంతా దోపిడీదార్ల పాలవుతోంది... వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఫలాలు పేదలకే అందేలా చూస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నపుడు కరువొచ్చినా తొమ్మిది గంటలపాటు రైతులకు విద్యుత్ సరఫరా చేశామని, ఆనాడే తాను ఉచిత విద్యుత్ ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌వారు అధికారంలోకి వచ్చి ఉండేవారు కాదన్న చంద్రబాబు... రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వచ్చాక సాగుకు ఉచితంగానే తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని వైఎస్, ఆయన తనయుడు జగన్ భ్రష్టుపట్టించారని, కాంగ్రెస్ రెండోమారు అధికారంలోకి వచ్చాక గత మూడేళ్ల పాలన కూడా అవినీతి ఊబిలోనే కూరుకుపోయిందని విమర్శించారు. నీతివంతమైన పాలన అందిస్తానంటున్న ప్రస్తుత సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరులు హైదరాబాద్, చిత్తూరులలో కౌంటర్లు ఏర్పాటుచేసి వసూళ్లకు తెగబడుతున్నారని ఆరోపించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స గాంధీభవన్‌ను బ్రాందీభవన్‌గా మార్చేశారని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eat slowly to stave off diabetes
Thousands of pills filled with powdered human baby flesh discovered by customs officials in south korea  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles