Senior ias officer srilakshmi says

senior ias officer srilakshmi says..

senior ias officer srilakshmi says..

31.gif

Posted: 05/06/2012 02:34 PM IST
Senior ias officer srilakshmi says

     sr సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కోర్టులో తన వాణి వినిపించారు. తనకో న్యాయం.. మంత్రికో న్యాయమా అని నిలదీశారు. శ్రీలక్ష్మీ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో  సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆమె తరఫున సురేంద్రరావు వాదనలు వినిపించారు. "ఓఎంసీకి లీజులు మంజూరు చేసేందుకు ఒకేరోజు రెండు జీవోలపై సంతకాలు చేసినట్లు ఆరోపించారు. అవే జీవోలపై అప్పటి మంత్రి (సబితా ఇంద్రారెడ్డి) కూడా సంతకాలు చేశారు కదా! నేను చేసింది తప్పైతే, ఆమె చేసింది తప్పు కాదా?'' అని శ్రీలక్ష్మి ప్రశ్నించారు. నిజానికి... ఏపీఎండీసీ పరిధిలోని 25 హెకార్లు ఓఎంసీకి దక్కకుండా తానే అడ్డుకున్నానన్నారు.  "ఆ 25 హెక్టార్లలో మైనింగ్ జరగనందున వాటినీ తమకే కేటాయించాలని సీఎం వైఎస్‌కు ఓఎంసీ లేఖ రాసింది. ఆ లేఖను సీఎంవో ద్వారా నాకు పంపారు. ఈ ప్రతిపాదనకు నేను ఒప్పుకోలేదు. ఫైల్‌ను మంత్రికి పంపలేదు. ఒకవేళ ఆ ఫైల్‌ను పంపి ఉంటే.... వైఎస్‌కు మంత్రి సన్నిహితమైనందున దాన్నీఆమోదించేవారు'' అని పేర్కొన్నారు. ఓఎంసీకి లీజుల కేటాయింపులో తన పాత్ర పరిమితమని శ్రీలక్ష్మి తెలిపారు. "ప్రతిపాదనలు పంపిన అధికారులను, జీవోలపై సంతకాలు చేసిన మంత్రిని విడిచిపెట్టి.. నాపైనే కేసులు పెట్టి, నన్నే అరెస్టు చేసి సీబీఐ పక్షపాతం చూపుతోంది. రాజకీయ బాస్‌ల కోసం నన్ను బలిపశువును చేస్తారా'' అని శ్రీలక్ష్మి ప్రశ్నించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  It search in madhurai peeth
Nakirekal hospital staff activities  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles