Bhanu cid custody complete to an end

bhanu cid custody complete to an end

bhanu cid custody complete to an end

15.gif

Posted: 05/03/2012 01:09 PM IST
Bhanu cid custody complete to an end

      మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ వ్యవహారంలో సీఐడీ దూకుడు పెంచింది. ఓ వైపు భానుని విచారిస్తూనే మరోవైపు ప్రత్యేక బృందాల ద్వారా భాను తలదాచుకున్న ప్రాంతాలలో దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇక నేటితో భాను కస్టడీ ముగియనందున నేటి సాయంత్రం విచారణకు సంబంధించిన వివరాలను సీఐడీ మీడియాకు తెలుపనుంది.bhanu ఇప్పటికే సియోని, పాండిచ్చేరి, విశాఖతో పాటు భాను తలదాచుకున్న ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో సీఐడీ దర్యాప్తు చేసింది. ఆయా ప్రాంతాల్లో వారు సేకరించిన సమాచారానికి సంబంధించి నివేదికలను అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం రెండు బృందాలు భాను జరిపిన కార్యకలాపాలు, అతడికి సహకరించిన వ్యక్తుల వివరాలను రాబట్టేందుకు కృషి చేస్తున్నాయి. హంద్రీనీవా కాంట్రాక్టర్ దగ్గరకు ఒక బృందం భాను తమ్ముడు వంశీ కృష్ణ దగ్గరకు మరో బృందం వెళ్లినట్లు తెలిసింది. భానుకి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేయడానికి సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. అటు, భాను ఖాతాల వివరాలను వెల్లడించాలని కొన్ని బ్యాంకులకు సీఐడీ లేఖ రాసింది. నేటితో భాను కస్టడీ ముగియనుండటంతో రేపు ఉదయం భానుని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే కస్టడీ సమయంలో భాను పెద్దగా సహకరించకపోవడంతో మరికొన్ని రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Money money money
Special package for anantapur says babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles