Cm kiran krishna district tour today

cm kiran krishna district tour today

cm kiran krishna district tour today

3.gif

Posted: 05/02/2012 01:06 PM IST
Cm kiran krishna district tour today

       ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ కృష్ణాజిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరి మూడు గంటలకు గన్నవరం చేరుకుంటారు. నాలుగు గంటలకు హిందూ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రజాపథం కార్యక్రమం పాల్గొంటారు. తరువాత మీసేవను ప్రారంభిస్తారు. రాత్రి ఏడున్నర గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.cm_kif

      జిల్లాలో పేరుకుపోయిన సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీయాలని టిడిపి సహా వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. బందర్ పోర్టు, పులిచింతల, డెల్టా ఆధునీకీకరణపనులు, ఇళ్ల నిర్మాణం, గన్నవరం ఎయిర్ పోర్టు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంటి సమస్యల పరిష్కారం కోరుతూ ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు ఓ వినతి పత్రాన్ని సిద్ధం చేశాయి. ప్రజాపథాన్ని ప్రతిపక్ష పార్టీలు అడ్డుకునే అవకాశం వుండటంతో.. అధికార పార్టీ నేతలు వారిని కట్టడి చేసేందుకు అస్త్రాలను సిద్ధం చేశారు. ఎవరికి వారు ఎత్తు పై ఎత్తులు వేస్తుండటంతో.. ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Surprising information coming from bhanu
Ysr congress president jagan mohan reddy blame chiru and chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles