Ysr congress president jagan mohan reddy blame chiru and chandrababu

ysr congress president jagan mohan reddy blame chiru and chandrababu

ysr congress president jagan mohan reddy blame chiru and chandrababu

5.gif

Posted: 05/02/2012 01:03 PM IST
Ysr congress president jagan mohan reddy blame chiru and chandrababu

      దొడ్డి దారిన ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తనకు లేదని జగన్ అన్నారు. దొరలా ముఖ్యమంత్రినవుతానని వెల్లడించారు.  తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన చంద్రబాబు, చిరంజీవిలపై ఘాటైన విమర్శలు చేశారు. రాయలసీమలో ఉప ఎన్నికల ప్రచారాన్ని జగన్ తిరుపతి నుంచి ప్రారంభించారు. jaతిమ్మినాయుడి పాలెం హరిజనవాడ నుంచి తొలిరోజు పర్యటన ప్రారంభించిన ఆయన.. సత్యనారాయణపురం, జీవకోన, లీలామహల్ జంక్షన్, తుడా ఆఫీసు, అన్నారావు సర్కిల్, చెన్నారెడ్డి కాలనీ, టౌన్ క్లబ్  తదితర ప్రాంతాల్లో రోడ్ షోలు, బహిరంగ సభ నిర్వహించారు.
      మొత్తంగా జగన్ టార్గెట్ బాబు చిరులా అనిపించింది.  టిడిపి అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవిలపై ఘాటైన విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రి పదవిపై వ్యామోహంతో.. ఓటేసిన ప్రజలను చిరంజీవి మోసం చేసారని జగన్ అన్నారు. తన బాధ్యతను మధ్యలోనే వదిలివేశారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమో లేక నియోజకవర్గ సమస్యల కోసమో రాజీనామా చేసివుంటే.. తాను సెల్యూట్  చేసి ఉండేవాడినని జగన్ అన్నారు. తిరుపతిలో తొలిరోజు పర్యటన ముగించిన తరువాత జగన్ తిరుమల చేరుకున్నారు. రాత్రికి అక్కడే బసచేశారు. మరోవైపు జగన్ ప్రచారాన్ని ఎన్నికల అధికారులు వీడియో చిత్రీకరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran krishna district tour today
Congress by election candidates announced  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles