Swiss government agree to give

swiss government agree to give..

swiss government agree to give..

26.gif

Posted: 04/30/2012 07:40 PM IST
Swiss government agree to give

      swiss_bank డబ్బెక్కడ దాచుకోవాలో తెలియక సతమతమై ఎక్కడో స్విస్ బ్యాంక్ లో మూలుగుబెట్టిన బడాబాబుల బండారం బట్టబయలు కానుంది. తాజాగా, బ్లాక్‌మనీకి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలను భారత్‌కు ఇచ్చేందుకు స్విట్జర్లాండ్‌ అంగీకారం తెలిపింది. ఈమేరకు కేంద్ర ఆర్ధికశాఖ వెల్లడించింది. పరిమిత సమాచారంతో కూడిన స్విస్‌ బ్యాంకు ఖాతా వివరాలను ప్రభుత్వానికి సీల్డ్‌కవర్‌లో అందించనున్నట్టు అధికారులు తెలిపారు. మరి కొద్దిరోజుల్లోనే స్విట్జర్లాండ్‌ నుంచి జాబితా అందుతుందని ఆర్థికశాఖ తెలిపింది. భారత పౌరుల అకౌంట్ల వివరాలను వెల్లడించేందుకు ఇరుదేశాల మధ్య ఏప్రిల్ 20 తేదిన డబుల్ టాక్సేషన్ అవాయిడెన్ అగ్రిమెంట్ (డీటీఏఏ)పై అవగాహన ఒప్పందం జరిగిన మేరకు ఈ వివరాలు ఇచ్చేందుకు వీలు కలిగింది. దీంతో బ్లాక్ మనీ కుట్టలు కుట్టలుగా దాచుకున్న కుభేరులెవరో తెలిసే వీలుచిక్కింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Granted bail to vijay sai reddy
Sentenced in graft case bangaru quits bjp party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles