K chandrasekhar rao says trs will not merge with congress

congress, Telangana, Rashtra Samithi, President, K Chandrashekar Rao, Casting, durability, KCR will merge, Telangana state, sonia, kcr, kcr meets sonia

K Chandrasekhar Rao says TRS will not merge with Congress.

KCR says TRS will not merge with Congress.gif

Posted: 04/27/2012 04:54 PM IST
K chandrasekhar rao says trs will not merge with congress

kcrటీఆర్ఎస్ పార్టీ ఏర్పడి నేటితో 11 సంవత్సరాలు అయిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ తో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. మొదట ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి, తెలంగాణ త్యాగధనులకు నివాళలు అర్పించారు.అనంతం కేసీఆర్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి టీఆర్ఎప్ పార్టీ తెలంగాణ కోసం పారాడుతుందని, ఇక పై కూడా తెలంగాణే లక్ష్యంగా శాంతియుతంగా పోరాడతామని అన్నారు.

తెలంగాణ కోసం పార్టీని పెట్టినప్పుడు పదవులు ఇవ్వకుంటేనే పార్టీని పెట్టాడని అది ఎంతో కాలం నిలవదని పలువురు సందేహాలు వ్యక్తం చేశారని, కానీ తన పార్టీ సత్తా ఏమిటో ఇప్పటికీ చూపుతూనే ఉన్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇప్పటికీ మోసం చేస్తూనే ఉందని అన్నారు. తెలంగాణ తీర్మానం పెట్టాలని పార్లమెంటులో డిమాండ్ చేసిన తమ ఎంపీలనే మార్షల్స్ చే గెంటివేయించిందని, ఒక వేళ వాళ్ళకు తెలంగాణ కావాలని ఉంటే అధిష్టానం కాళ్ళు పట్టుకొని వేళ్ళాడకుండా తమతో వచ్చి పోరాడాలని సూచించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ మిత్రద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. తన దెబ్బతో కూలబడిన పార్టీ ఇంకా కోలుకోవడం లేదని ఆయన అన్నారు.

సమైక్య పాలనలో తెలంగాణ జీవనం విధ్యంసం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.పాశవిక అణచివేతల వల్లే తెలంగాణ ఉద్యమాలు ముందుకు సాగలేదన్నారు. త్యాగాల పునాదుల మీద టీఆర్ఎస్ ఏర్పడిందని చెప్పారు. కలుషిత జలాలతో పొంగిపొరలే మూసినదికి తెలంగాణ వస్తేనే పూర్వవైభవం వస్తుందన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేస్తామని ఆయన హమీ ఇచ్చారు.

గత కొన్ని రోజుల నుండి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలుస్తుందనే వార్తలు వస్తున్నాయని, తాము కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేరబోమని ఇది తాను అధికారికంగా చెబుతున్నాని అన్నారు. పార్టీని పునర్నిర్మించి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతానని ఆయన హామి ఇచ్చారు.

ఇదిలా ఉండగా, మాజీ డిజిపి పేర్వారం శ్రీరాములు కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. రంగారెడ్డి జిల్లా టిడిపి నేత లక్ష్మణరావు కూడా టిఆర్ఎస్ లో చేరారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Television for dogs launches in the us
Tendulkar get seat no 100 in rajya sabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles