Hyderabad 3rd most affordable office location in 2011

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Hyderabad has emerged as the world's third most affordable office location in 2011 in a list prepared by global realty consultant DTZ, which has also named Chennai and Pune among the top

Hyderabad 3rd most affordable office location in 2011.gif

Posted: 04/23/2012 05:44 PM IST
Hyderabad 3rd most affordable office location in 2011

Hydarabadహైదరాబాద్ లో అద్దెలు చాలా తక్కువని తాజాగా డీటీజెడ్ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్‌లో గత ఏడాది 2011లో ఆఫీసులు అద్దెలు చాలా చౌక అని అందుబాటు అద్దెల విషయానికి వస్తే హైదరాబాద్‌ మూడవస్థానం దక్కించుకుందని గ్లోబల్‌ రియల్టీ కన్సెల్టెంట్‌ డీటీజెడ్‌ ఒక నివేదికలో పేర్కొంది. ఈ జాబితాలో  చెన్నై, పూనేలు కూడా టాప్‌ 5 స్థానాలు దక్కించు న్నాయి. డీటీజెడ్‌ తాజా అధ్యయనం గ్లోబల్‌ ఆక్యుపెన్సీ కాస్ట్‌ - ఆఫీసస్‌లో ఈ వివరాలు పొందుపరిచింది. ఇండోనేషియాలోని సురభాయా, చైనాలోని క్విన్‌డాలు టాప్‌ రెండు స్థానాలు దక్కించుకుంది. గత ఏడాది అతి చౌక అద్దెల స్థానాలు చైనా, ఇండోనేషియాలు దక్కించుకున్నాయి. టైర్‌-2 నగరాల విషయానికి వస్తే భారత్‌, చైనాలే టాప్‌లో ఉన్నాయి.

ప్రపంచంలోని 10 టాప్‌ చౌక అద్దెల విషయానికి వస్తే ఇండోనేషియాకు చెందిన సురాభయ నెంబర్‌ వన్‌స్థానంలో ఉందని, అత్యధిక ఖరీదయిన అద్దెల విషయానికి వస్తే హాంగ్‌కాంగ్‌, లండన్‌, జెనీవా, టోక్యో, జ్యూరిచ్‌ టాప్‌ 5 స్థానాలు దక్కించున్నాయి. అద్దెల విషయానికి వస్తే సురభయ (ఇండోనేషియా) క్వింగ్‌డాలు సరాసరి అద్దెలు ఏడాదికి వరుసగా 1,680 డాలర్లు, 2,380 డాలర్లుగా వసూలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌, చెన్నై, పూనేల విషయానికి వస్తే సంవత్సరం అద్దెలు 2,430 డాలర్లు, 2,570 డాలర్లు, 2,590 డాలర్లుగా ఉంది. అత్యధిక ఖరీదైన అద్దెల విషయానికి వస్తే హాంగ్‌కాంగ్‌లో ఏడాదికి 25,160 డాలర్లు, లండన్‌, జెనీవాలు వరుసగా 22,590, 18,740 డాలర్లుగా వసూలు చేస్తున్నారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా అద్దెలు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. భారత్‌తో పాటు చైనా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న నేపథ్యంలో పెద్ద నగరాల్లో ఆఫీసు అద్దెలు పెరుగుతున్నాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  K jana reddy eyes cm post
No fertile men in 50 years as sperm counts slide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles