No fertile men in 50 years as sperm counts slide

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Blame it on growing levels of stress, obesity or pollutants in the air, counts of the microscopic sperm are falling and causing mega concern across the globe.

No fertile men in 50 years as sperm counts slide.gif

Posted: 04/23/2012 02:55 PM IST
No fertile men in 50 years as sperm counts slide

Spearm-countమారుతున్న కాలంతో పాటు సగటు మనిషి జీవిత ప్రమాణాలు మారుతున్నాయి. వాటి ఫలితంగా రానున్న కాలంలో మగవారు లేకుండా పోతారని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. రానున్న 50 సంవత్సరాల్లో బావి తరాల పిల్లలకు సంతానం కనే శక్తి ఉండదని చెబతుతున్నారు. గడచిన 50ఏళ్లలో సగటు వీర్యకణాల సంఖ్య యాభై శాతం తగ్గిపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తల అంచనా. పెరుగుతున్న ఒత్తిడి, స్థూలకాయం, వాయు కాలుష్యం వంటి కారణాలతో ఈ ముప్పు వాటిల్లుతోందంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా పాశ్చాత్యుల్లో వీర్యకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని, అదే సమయంలో భారత్‌లో కూడా తగ్గుదల నమోదవుతున్నట్లు గుర్తించామని ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త పి.ఎం. భార్గవ వెల్లడించారు.కొన్నేళ్ల కిందట స్కాట్లండ్‌లో జరిగిన ఓ పరిశోధన ఫలితాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. 1989 నుంచి 2002 మధ్య కాలంలో 7500 మందిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు- కాలక్రమంలో వారి వీర్యకణాల సంఖ్య 30% తగ్గినట్లు నిర్ధారించారని తెలిపారు.

కాలుష్యంతోపాటు ప్లాస్టిక్‌లో నిల్వ ఉంచే ఆహారపదార్థాల వినియోగం కూడా వీర్యకణాలపై ప్రభావం చూపుతోందని కొందరు పరిశోధకులు కనుగొన్నారు. ప్లాస్టిక్ నుంచి స్త్రీలలో విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్‌ను పోలిన రసాయనం ఉత్పన్నమవుతోందని, ఇది వీర్యకణాల సంఖ్యను ప్రభావితం చేస్తోందని తేల్చారు. ఈ సిద్ధాంతంపై కొంత వ్యతిరేకత కూడా వస్తోంది. ఇంతవరకూ ఇది అధికారికంగా నిరూపితం కాలేదన్నది వారి వాదన. మరోవైపు డబ్ల్యూహెచ్‌వో కూడా వీర్యకణాల సంఖ్య విషయంలో యాభై ఏళ్ల క్రితం స్పెర్మ్ బ్యాంకు(వీర్య నిధి)లకు విధించిన నియమాలను ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సి వస్తోందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. 1950లో మిల్లీ లీటర్‌కు 11.30కోట్ల వీర్య కణాలను సాధారణ సంఖ్యగా పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో ఇప్పుడు 2కోట్ల వీర్యకణాలుంటే చాలంటోంది!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad 3rd most affordable office location in 2011
Average bp falls across world rises in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles