Tg venkatesh made a sensational comments

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

TG Venkatesh made a sensational comments on YSR Congress party president YS Jagan. He said that YSR Congress party will win coming bypollls and YS Jagan Odarpu Yatra is clinching public. He suggested to solve Telangana issue early

TG Venkatesh made a sensational comments.gif

Posted: 04/18/2012 01:54 PM IST
Tg venkatesh made a sensational comments

TG_Venkateshకాంగ్రెస్ నాయకుడు, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టి.జి. వెంకటేశ్ ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ మధ్యనే తెలంగాణ పై స్టేట్ మెంట్ ఇచ్చి హైలెట్ అవ్వగా, తాజాగా కర్నూలు లోని నంద్యాలలో జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్ర కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఆయన అన్నారు.

తన తండ్రి పేరు చెప్పుకొని జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రకు జనం నుండి మంచి స్పందనే వస్తుందని, ఉప ఎన్నికల లోపు తెలంగాణ పై ఏదోఒక నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ నష్టపోవడం ఖాయం అని, ఒక వేళ సరైన నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ నాయకులు జగన్ పార్టీలో చేయడం ఖాయమని ఆయన అభిప్రాయ పడ్డారు. రాయల తెలంగాణ వైపు ప్రజలు ఎక్కువ మొగ్గుచూపుతున్నారని, అయితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మెజార్టీ ప్రజలు కోరుతున్నందున తాము సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామన్నారు. మంత్రి టిజి వెంకటేష్ వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. మరి రాష్ట్ర కాంగ్రెస్ కి కేరళ వైద్యం చేయడానికి వచ్చిన వాయలార్ రవి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వీటికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan to send bin laden family to saudi
Mitt romney gaining on barack obama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles