Pet dogs in the workplace may ease stress

Pet dogs in the workplace 'may ease stress,dog, workplace, employee, pet, stress, job satisfaction

Pet dogs in the workplace 'may ease stress

Pet dog.gif

Posted: 04/02/2012 08:33 PM IST
Pet dogs in the workplace may ease stress

Pet dogs in the workplace 'may ease stress

ఆఫీసులో విపరీతమైన పని ఒత్తిడి ఉంటోందా? ఆ ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారా? ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాల్లో ప్రయత్నించి విఫలమయ్యారా? అయితే.. మీ వెంట ఆఫీసుకు మీ పెంపుడు కుక్కపిల్లను తీసుకెళ్లండి! అదేంటి అంటారా.. పనిచేసే స్థలంలో పెంపుడు కుక్కపిల్ల తోడుంటే.. మీ పని ఒత్తిడి మటుమాయం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన వర్జీనియా కామన్‌వెల్త్ యూనివర్సిటీ ఈ అంశంపై పరిశోధన చేసింది.

ఓ సంస్థలో పనిచేసే ఉద్యోగులు కొందరిని ఈ పరిశోధన కోసం ఎన్నుకున్నారు. వారిలో సగం మందికి తమ పనిస్థలానికి పెంపుడు కుక్కపిల్లను తోడు తెచ్చుకునే అవకాశమిచ్చారు. మిగతా వారు సాధారణంగానే విధులకు వచ్చారు. పరిశోధన జరిగినన్ని రోజులూ.. ఆ ఉద్యోగులను మధ్యలో కొద్ది సేపు వారి కుక్కపిల్లలతో ఆడుకోనిచ్చారు. అదే సమయంలో ఉద్యోగులందరిలో ఒత్తిడి కారణమయ్యే హార్మోన్ల స్థాయిలను పరిశోధకులు పరిశీలించారు. కుక్కపిల్లను తెచ్చుకున్నవారిలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ల స్థాయి తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sabitha indra reddy
Balakrishna at london  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles