Chief minister n kiran kumar reddy

chief minister N Kiran Kumar Reddy,Rs 250 crore was allotted for this project, budget ,

chief minister N Kiran Kumar Reddy

Kiran.gif

Posted: 04/02/2012 08:22 PM IST
Chief minister n kiran kumar reddy

chief minister N Kiran Kumar Reddy

ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రచార వ్యయం భారీగా పెరిగిపోయింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2011-12) బడ్జెట్‌లో ప్రచారం కోసం రూ.50 కోట్లను కేటాయించగా అందుకు అదనంగా రూ.200 కోట్ల వ్యయానికి సప్లిమెంటరీ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అనుమతి పొందింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనల కోసం అదనపు బడ్జెట్‌ను పొందినట్లు పేర్కొంది. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం వ్యయం కాలేదని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. పని తక్కువ.. ప్రచారం ఎక్కువ తరహాలో ఏడాదిలో ప్రచారం వ్యయం రూ.250 కోట్లు అయ్యిందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా తన పేరు ప్రజలందరికీ తెలియాలనే తపనతో కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టణాలు, నగరాల్లో తన ఫొటోతో ఉన్న హోర్డింగ్‌లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించిన విషయాన్ని తెలియజేసింది. దీంతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలను తన పథకాలుగా పేర్కొంటూ ప్రచారం చేసుకోవడానికి సీఎం ఎలక్ట్రానిక్ మీడియాకు పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేశారు. వివిధ రకాల్లో ప్రచారం కోసం ఇంత పెద్ద మొత్తంలో ప్రచారానికి వ్యయం చేయడంపై అధికారవర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు పెద్ద ప్రకటనల పేరుతో పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చినట్లు సమాచార శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna at london
Fuego company car  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles