Yeddyurappa to be made cm in 24 hours

Yeddyurappa,Sadananda Gowda,karnataka chief minister

BJP leader B S Yeddyurappa is likely to be reinstated as Karnataka chief minister, according to TV reports. The announcement will be made within 24 hours.

Yeddyurappa to be made CM in 24 hours.gif

Posted: 03/21/2012 07:13 PM IST
Yeddyurappa to be made cm in 24 hours

Yadurappaకర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పట్టువదలి విర్కమార్కుడిగా బీజేపీ అధిష్టానంతో గత కొంత కాలంగా పదవి కోసం పోరాడుతున్నాడు. బీజేపీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. తనను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబట్టిన యడ్యూరప్ప చివరకు అనుకున్నది సాధించినట్లుగా వార్తలు తెలుస్తుంది.

అక్రమ మైనింగ్ కేసులో లోకాయుక్త దెబ్బకు గత జులైలో పదవీచ్యుడైన యడ్యూరప్ప, తరువాత వాటిని హైకోర్టు త్రోసి పుచ్చడంతో మళ్ళీ పీఠం పై కూర్చోవాలని అధిష్టానానికి డెడ్ లైన్ల మీద డెడ్ లైన్లు పెట్టి అధిష్టానికి నిద్రలేకుండా చేశాడు. తాజాగా తన మద్దతుదారులతో రిసార్టులలో శిబిరం నిర్వహిస్తున్నాడు. తనకు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు కూడా అధిష్టానికి సంకేతాలు ఇచ్చాడు. ఇక చేసేది లేక బీజేపీ అధిష్టానం మళ్లీ యడ్యూరప్పకు పదవి కట్టబెట్టేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న 24 గంటల్లో బీజేపీ అధిష్టానం దీని పై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ నుండి పిలుపు కూడా వచ్చినట్లు తెలుస్తుంది.

ఈ వార్తల్లో నిజమెంతో అబద్దమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. ఒక వేళ యడ్డీకి అనుకూల ప్రకటన చేస్తే గనుక అనుకున్నది యడ్డీ సాధించినట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati rajagopal
Jagans candidate will win  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles