Jagans candidate will win

Jagans Candidate Will Win,very significant victory for the YSR Congress party,party president Y S Jaganmohan Reddy,Nallapureddy Prasanna Kumar Reddy ,TDP candidate Somireddy Chandramohan Reddy, MLA P Srinivasa Reddy

Jagans Candidate Will Win

Jagans.gif

Posted: 03/21/2012 03:02 PM IST
Jagans candidate will win

Jagans Candidate Will Win

ప్రతిష్టాత్మకంగా జరిగిన కోవూరు ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థి ఎస్ చంద్రమోహన్ రెడ్డిపై 23,496 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నల్లపురెడ్డి విజయంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

రాష్ర్టంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రెండో ఎమ్మెల్యే గా ఎన్నికయిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరు ఉప ఎన్నికలో తన గెలుపు కాంగ్రెస్, టీడీపీలకు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. తానెప్పుడూ మెజారిటీ గురించి మాట్టాడలేదని, గెలుస్తానని మాత్రమే చెప్పానని అన్నారు. తనకు 23,496 ఓట్ల ఆధిక్యం రావడం మామూలు విషయం కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీలు విచ్చలవిడిగా డబ్బులు పంచినా తనకు ఇంత మెజారిటీ రావడం చిన్న విషయం కాదని చెప్పారు. ఈ రెండు పార్టీలకు నూకలు చెల్లాయన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ సేవలకు ఓటర్లు పట్టం కట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. యువనేత వైఎస్ జగన్ నాయకత్వంలో తనను ఆశ్వీరదించి ప్రజలు గెలిపించారనన్నారు. కోవూరు ప్రజలకు రుణపడివున్నానని అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసినవారందరికీ ప్రసన్నకుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddyurappa to be made cm in 24 hours
Andhra pradesh by election vote counting poll results 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles