Ips narendra kumar singhs family demands justice

IPS Narendra Kumar Singh's family demands justice,narendra kumar singh, mining mafia, keshav dev, ips officer, crushed to death, ips narendra kumar singh, narendra kumar singh's wife, madhurani tewatia,crushed to death,ias officer,india news,ips narendra kumar singh,ips officer,keshav dev,madhurani tewatia,mining mafia,narendra kumar

IPS Narendra Kumar Singh's family demands justice

Narendra.gif

Posted: 03/14/2012 11:06 AM IST
Ips narendra kumar singhs family demands justice

IPS Narendra Kumar Singh's family demands justice

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి వజ్రాన్ని ఇచ్చానని, వారు మాత్రం తనకు బూడిదతో కూడిన చెత్తబుట్టను ఇచ్చారని మైనింగ్‌ మాఫియా చేతిలో హత్యకు గురైన ఐపిఎస్‌ అధికారి నరేంద్ర కుమార్‌ తండ్రి కేశవ్‌ దేవ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తన కుమారుని హత్యకు వ్యతిరేకంగా గొంతు కలపాలని పోలీసులకు పిలుపునిచ్చారు. తనకు న్యాయం కావాలని వేడుకున్నారు. ఈమేరకు ఆయన ఓ ఆంగ్ల ఛానల్‌తో మాట్లాడారు. 'మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి వజ్రాన్ని ఇచ్చాను. వారు మాత్రం బూడిదతో కూడిన చెత్తబుట్టను ఇచ్చారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా గొంతెత్తాలని పోలీసులకు పిలుపునిస్తున్నాను. న్యాయ కోసం వేడుకుంటున్నాను. ఈ పోరాటంలో మద్దతునివ్వండి' అని చెప్పారు.

తన కూమారుని హత్య వెనుక కుట్ర ఉందన్నారు. అక్రమ ఖనిజ రవాణాను అడ్డుకున్న ఐపిఎస్‌ అధికారి నరేంద్ర కుమార్‌పై ట్రాక్టర్‌ నడిపి ఆయన్ను హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే హత్య వెనుక కుట్ర ఉందన్న ఆరోపణలను పోలీసులు తిరస్కరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, లభించిన రుజువుల ప్రకారం ట్రాక్టర్‌ డ్రైవరు మనోజ్‌ గుర్జార్‌కు మైనింగ్‌ మాఫియాతో ఎటువంటి సంబంధాలు లేవని కేసును విచారిస్తున్న సీనియర్‌ పోలీసు అధికారి డిపి గుప్తా పేర్కొన్నారు. నరేంద్ర హత్యపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి న్యాయవిచారణకు ఆదేశించారు.

అయితే తన భర్త హత్యపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని నరేంద్ర భార్య మధురాణి తెవాటియా డిమాండ్‌ చేశారు. ఈ విషయంతో జాతి యావత్తూ తన వెంబడి ఉందని, ప్రభుత్వం మాత్రం ముందుకు రావడం లేదని విమర్శించారు. 'ప్రభుత్వ తీరుతో చాలా నిరుత్సాహానికి గురయ్యాను. నేను వారికి సేవచేస్తున్నాను. ఎటువంటి సంతాపం, కనీసం ఓదార్పు మాట కూడా లేదు. ఇప్పటికే నాలుగు రోజులు గడిచాయి. దేశం యావత్తూ నాకు మద్దతుగా ఉంది. నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి సహాయం లేదు' అని ఆమె పేర్కొన్నారు. ఐఏఎస్‌గా పనిచేస్తున్న తెవాటియా త్వరలో ఓ బిడ్డకు తల్లి కాబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kiran seeks ags advice on mantris in trouble
Manoj gautham  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles