Kiran seeks ags advice on mantris in trouble

Kiran seeks AG's advice on mantris in trouble,Supreme Court,Ranjeev Acharya,Ponnala Lakshmaiah,Pankaj Dwivedi,Kiran Kumar Reddy,J udicial Event,Geeta Reddy, ponnala lakshmaiah,

Kiran seeks AG's advice on mantris in trouble

Kiran.gif

Posted: 03/14/2012 12:14 PM IST
Kiran seeks ags advice on mantris in trouble

Kiran seeks AG's advice on mantris in trouble

జగన్‌ ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు నోటీసులివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే మద్యం సిండికేట్ల విషయంలో మంత్రుల పాత్రతో ప్రభుత్వం అప్రతిష్టపాలైంది. తాజాగా జగన్‌ ఆస్తుల కేసులో మంత్రులకు నోటీసులివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడం పట్ల ఆందోళన చెందుతోంది. నోటీసులపై స్పందించాల్సింది వ్యక్తిగతంగానా, ప్రభుత్వపరంగానా అనే దానిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమాలోచనలు జరుపుతున్నారు.

జగన్‌ ఆస్తుల కేసులో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, మోపిదేవి వెంకటరమణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయమై చర్చించేందుకు అసెంబ్లీలోని సిఎం ఛాంబర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డితో గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు,  కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య సమావేశమయ్యారు. కేసుకు సంబంధించి అనేక విషయాలపై చర్చించారు. ఈ చర్చలో మీడియాతో సిఎం చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. నోటీసులు అందుకున్నవారే వ్యక్తిగతంగా స్పంది స్తారని చెబితే ఎలా అని మంత్రులు అడిగినట్లు తెలిసింది.

ప్రభుత్వంలో భాగంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తప్ప వ్యక్తిగతానికి తావెక్కడుంటుందని, ఆ రకమైన ప్రకటనల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నట్లు తెలిసింది. మంత్రులపై వస్తున్న ఆరోపణలకు అండగా ఉండకపోతే ఏ రకంగా ప్రజల్లో తిరగగలమని ప్రశ్నించినట్లు తెలిసింది. మంత్రివర్గంలో చేసిన నిర్ణయాలకు మంత్రులందరికీ సమాన బాధ్యత ఉంటుందని, గతంలో ఎవరికివారు మంత్రులందరూ చేసిన ప్రకటనలనే ప్రస్తావించాను తప్ప వాటికి భిన్నంగా తానెక్కడా మాట్లాడలేదని సిఎం చెప్పినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు నోటీసులందాక వ్యక్తి గతమా, ప్రభుత్వపరంగానా... ఏ రకంగా అఫిడ విట్‌ వేయాలనేది చూద్దామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chanchalguda jail housefull with vips
Ips narendra kumar singhs family demands justice  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles