Rajya sabha election notification announced

rajya sabha, election, notification announced

rajya sabha election notification announced

24.gif

Posted: 03/12/2012 04:30 PM IST
Rajya sabha election notification announced

          rajya-sabha-polls2రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలయింది. రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి బరిలో నిలిచే అభ్యర్థులు ఈ నెల 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. 20న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ 22.
          రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, దాసరి నారాయణరావు, జి.సంజీవరెడ్డి, రషీద్ అల్వీ(కాంగ్రెస్), మైసూరారెడ్డి(టీడీపీ), అజీజ్‌పాషా(సీపీఐ) పదవీకాలం ఏప్రిల్ రెండవ తేదీతో ముగియనుంది. వీరి స్థానంలో ఈ దఫా రాజ్యసభ కొలువులు ఎవరిని వరించనున్నాయో నని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
          ఈ నేపథ్యంలో నిర్వహించబోతున్న ఎన్నికల్లో ఆరుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లయితే ఎన్నిక ఏకగ్రీవమైనట్లే. ఒకవేళ ఏడో అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేసినట్లయితే మాత్రం ఎన్నికలు అనివార్యం. అందుకోసం 30న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fatwa against full body scans
High speed trains in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles