సీబీఐ కోర్టు అనగానే మనకు గుర్తొచ్చేది భయం. ఆ కోర్టులో పెద్ద పెద్ద జడ్జిలు, లాయర్లు ఉంటారు. అలాంటి చోట అసలు భయం తప్పా ఆనందం కనిపించదని అనుకుంటాం, కానీ దీనికి విరుద్దంగా ఎప్పుడూ గంభీరంగా ఉండే సీబీఐ ప్రత్యేక కోర్టు పిట్టకథలతో సందడిగా మారింది. ఎమ్మార్ నిందితుడు విజయరాఘవ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిట్ట కథల జోరు చోటు చేసుకుంది. విజయరాఘవ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ దిల్జిత్‌సింగ్ అహ్లూవాలియా వాదనలు వినిపించారు.
తన క్లయింట్ బెయిల్ విషయంలో కోర్టు మంచి తీర్పు ఇస్తుందన్న విశ్వాసం ఉందని చెప్పేందుకు ప్రయత్నించారు. దీనికిగాను ఓ పిట్టకథను ఉదహరించారు. "ఆకాశంలో ఓ విమానం ప్రయాణిస్తోంది. విమానం ప్రమాదానికి గురైందని, అంతా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకుని మాస్క్ పెట్టుకోవాలని ఫ్లైట్‌లో ప్రకటన వినిపించింది. అయినా 11 ఏళ్ల ఓ బాలిక మాస్క్ పెట్టుకోలేదు. నీకు భయం లేదా? అని ఓ కుర్రాడు ఆమెను అడిగాడు. దానికి.. ఫ్లైయిట్ నడిపేది మా నాన్నే! ఆయన నన్ను క్షేమంగా తీసుకెళ్లగలరని నాకు పూర్తిగా విశ్వాసం(ట్రస్ట్) ఉందని చెప్పింది. అలాగే ఈ కేసులో మా క్లయింట్ విషయంలో కోర్టుపై విశ్వాసం ఉంది''అని ముగించారు. తర్వాత సీబీఐ న్యాయవాది తన వాదనలు కొనసాగించారు.
అవి కూడా ముగిశాక కోర్టు హాలులోనే ఉన్న సీబీఐ జేడీ లేచి ఓ పిట్టకథ వినిపించారు."ఓ ఊర్లో వానలు లేవని అంతా బాధపడుతుంటారు. మరుసటి రోజు గుడికి వెళ్లి పూజలు చేయాలని నిర్ణయించుకుంటారు. మరునాడు ఉదయమే గుడికి బయలుదేరారు. ఒకే ఒక బాలిక మాత్రం గొడుగుతీసుకుని వెళ్లింది. దేవుడిపై ఫెయిత్(నమ్మకం)ఉండబట్టే వర్షం వస్తుందని ఆమె గొడుగుతో వెళ్లింది. మిగతా వారు అది లేకుండా వెళ్లారు. కోర్టుపై మాకు ఫెయిత్ ఉంది'' అని కౌంటర్ పిట్టకథ చెప్పారు. దీంతో జడ్జి నాగమారుతీశర్మతో సహా కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, విలేకరులు ఒక్కసారిగా నవ్వారు. వాదనలతో బుర్ర వేడెక్కిపోతుండగా.. ఈ పిట్టకథలు బాగానే నవ్వించాయని న్యాయవాదులు గుసగుసలాడుకోవడం విశేషం. అయితే ఇంకొందరు మాత్రం కేసును పరిష్కరించేది ఏమైనా ఉందా లేక ఇలాంటి పిట్టకథలు చెప్పుకుంటూ కాలయాపన చేయడమేనా అని చెవులుకొరుక్కున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more