Galla jayadev said that he will contest from tirupati

galla jayadev, galla aruna kumari, chiranjeevi, tirupati, guntur

Minister Galla Aruna Kumari's son Galla Jayadev said that he will contest from Tirupati, if Chiranjeevi resigns

Galla Jayadev.GIF

Posted: 03/08/2012 06:31 PM IST
Galla jayadev said that he will contest from tirupati

jadadevకాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మంత్రి గల్లా అరుణకుమారి కొడుకు గల్ల జయదేవ్ రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని అరుణ కుమారి మొన్న విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అయితే ఇప్పడు ఆయనే స్వయంగా నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్తే తాను తిరుపతి నుంచి శానససభకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ చెప్పారు. తిరుపతి శాసనసభా సీటుకు చిరంజీవి రాజీనామా చేసి రాజ్యసభకు నామినేట్ అయితే, జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తాను ఇప్పటి వరకు వ్యాపారవేత్తగా ఉన్నానని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంపై కాంగ్రెసు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతూనే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జయదేవ్ తెలిపారు. చిరంజీవి రాజ్యసభకు వెళ్లకుండా తిరుపతి నుంచి శాసనసభ్యుడిగా కొనసాగితే తాను 2014లో శాసనసభకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ganga bhavani and rajini reddy
Vijayaraghava petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles