Sashikala husband arrested

sashikala husband arrested,

sashikala husband arrested,

natarajan-1-2.gif

Posted: 02/19/2012 11:17 AM IST
Sashikala husband arrested

natarajanరాజకీయాల్లో చకచకా పావులు కదపటమంటే ఏమిటో తమిళనాడు నుంచి నేర్చుకోవాలి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు అత్యంత సన్నిహితంగా మెలిగిన శశికళతో చెడిపోవటంతో శశికళనే కాకుండా ఆమె బంధువర్గాన్ని సైతం వారి పదవుల్లోంచే కాకుండా మౌలికమైన పార్టీ సభ్యత్వం నుంచి తొలగించిన తర్వాత కూడా వారి శాప ఫలం అంతటితో పూర్తికాలేదు. శశికళ భర్త నటరాజన్ ని శనివారం సాయంత్రం హడావిడిగా అరెస్ట్ చేసి తంజావూర్ తీసుకునివచ్చి, తెల్లవారు ఝామున 3.30 నుంచి అతన్ని ప్రశ్నించి, ఆదివారం ఉదయం మాజిస్ట్రేట్ నివాసంలోనే హాజరుపరచే ముందు అతనికి వైద్య పరీక్షలు చేయించారు.

నటరాజన్ కి మార్చ్ 2 వరకూ జ్యడిషియల్ కస్టడీ విధించి, తిరుచ్చి సెంట్రల్ జైల్ కి తరలించారు. తన ఆరోగ్యం బాగోలేదని, ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం చేయించుకోవటానికి అనుమతినివ్వమని నటరాజన్ మేజిస్ట్రేట్ ని కోరగా, జైల్లో వైద్య సదుపాయాలను ఉపయోగించుకోమని ఆమె చెప్పారు.

ప్రభుత్వం తమ కుటుంబాన్ని వేధిస్తోందని, అయినా అన్నా అభిమానులుగా అన్నా సిద్ధాంతాలను అనుసరించే తామంతా కష్టాలను ఓర్పుతో సహిస్తామని నటరాజన్ విలేకర్లకు చెప్తూ, తన అరెస్ట్ జయలలిత జన్మదిన కానుకగా భావిస్తున్నానని, ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నామన్నారు నటరాజన్ అన్నారు.

ఇంతకీ అసలు ఎందుకు అరెస్ట్ చేసారంటే లాండ్ గ్రాబింగ్ కేసులో వివిధ సెక్షన్ల కింద.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Written exams held today for vros and vras
Captain of italian ship and 2 security guards asked to surrender  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles