Captain of italian ship and 2 security guards asked to surrender

captain of italian ship and 2 security guards asked to surrender

captain of italian ship and 2 security guards asked to surrender

italians-1-2.gif

Posted: 02/19/2012 10:38 AM IST
Captain of italian ship and 2 security guards asked to surrender

italiansకేరళ సముద్ర జల ప్రాంతంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ మత్యకారులను పొట్టనబెట్టుకున్న ఇటలీ వర్తక నౌక కెప్టెన్ ని, కాల్పులు జరిపిన ఇద్దరు గార్డ్స్ ని కేరళ పోలీసులకు లొంగిపొమ్మని అదేశించవలసిందిగా విదేశాంగ మంత్రి ఎస్ ఎమ్ కృష్ణ ఇటలీ దేశ విదేశాంగ మంత్రికి సూచించారు. మర్యాద పూర్వకంగా ముఖాలకు నవ్వు పులుముకుంటూ విదేశ దౌత్య సంబంధాలను పురస్కరించుకుని తియ్య తియ్యగా మాట్లాడుకోవటం ఇక చాలంటూ ఎస్ ఎమ్ కృష్ణ ఉదంతాన్ని చరమాంకానికి తీసుకొచ్చారు.

కలిసి దర్యాప్తు సాగిద్దాం కానీ వాళ్ళు ముగ్గురినీ పంపించేయండంటూ రోమ్ నుంచి విదేశాంగ మంత్రికి దౌత్య రీతిలో అభ్యర్థనలు జరిగాయి కానీ నిందితులైన ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ లనూ అదుపులోకి తీసుకోవటానికి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కేంద్ర రక్షణ శాఖ సహాయాన్ని కోరారు. ఆ ఇటాలియన్లను అరెస్ట్ చెయ్యమని రాష్ట్ర అటర్నీ జనరల్ ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వానికి మరో దారి లేదంటూ ఊమెన్ చాందీ ఎస్ ఎమ్ కృష్ణకు తెలియజేసారు.

ఎస్ ఎమ్ కృష్ణ, రోమ్ లోని భారత దౌత్యవేత్త కూడా ఈ సంఘటన రెండు దేశాల మధ్యనున్న దౌత్యసంబంధమైన విషయం కాదని, భారత భూభాగంలో భారతీయులను హత్య చేసినందుకు హంతకులు చట్టానికి లొంగిపోవలసిన అవసరం ఉందని ఇటలీ ప్రభుత్వానికి తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sashikala husband arrested
Amarsingh helicopter emergency landing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles