Mulayam says will support congress if needed

Mulayam says will support Congress if needed,UP Polls, Polls 2012, SP, Congress, Mulayam Singh Yadav

Mulayam says will support Congress if needed

Mulayam.gif

Posted: 02/16/2012 09:54 AM IST
Mulayam says will support congress if needed

Mulayam says will support Congress if needed సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రెండు నాలుకల ధోరణికి ఇది నిదర్శనం హమీర్‌పూర్‌లో జరిగిన సభలో మాట్లాడిన ఆయన బిజెపిని అధికారంలోకి రానీయకుండా ఉండేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రకటన వెలువడిన స్వల్ప వ్యవధిలోనే మాట మార్చారు. తాను చేసిన వ్యాఖ్యల రాజకీయ ప్రభావాన్ని అర్ధం చేసుకున్న ములాయం లక్నోలో హడావుడిగా విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని, యూపి ఎన్నికల్లో తమకు పూర్తి మెజారిటీ వస్తుందని ప్రకటించారు. మూడు దశల పోలింగ్ తమకు అనుకూలంగానే ఉందని సమాజ్‌వాది పార్టీ కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తీరుతుందనే ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ బిజెపి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తే కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి వెనుకాడమని ఆయన చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి తమకు అనుకూలంగా ఓటువేయడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికార బిఎస్పీపై ఆయన విరుచుకుపడ్డారు. గూండాయిజం, రౌడీయిజం పెచ్చుపెరిగిపోయాయని, బిఎస్పీ మాఫియా రాజకీయాలు నడుపుతోందని ఆరోపించారు. సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వస్తే గూండాలు, మాఫియా నాయకులను జైళ్ళకు పంపుతుందని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anam ramanarayana reddy
Honduras prison fire kills more than 350 inmates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles