Anam ramanarayana reddy

anam ramanarayana reddy,Anam Ramanarayana Reddy is a Congress MLA from Andhra Pradesh,TDP party, Assembly, Congress party, TDP MLA Veerabhadra rao , savithri, Yamadharma raja, Dharmaraja,

anam ramanarayana reddy

anam.gif

Posted: 02/16/2012 10:02 AM IST
Anam ramanarayana reddy

Anam-Ramanarayana-Reddy-రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధర్మరాజా? యమధర్మరాజా? అన్న అంశంపై శాసనమండలిలో కొద్దిసేపు రసవత్తరమైన చర్చ జరిగింది. లిక్కర్ సిండికేట్ వ్యవహారంపై ఎసిబి నివేదికను సభకు సమర్పించాలంటూ టిడిపి చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వం తరఫున ఆనం ప్రకటించారు. ఈ సందర్భంగా విపక్షనేత దాడి వీరభద్రరావు లేచి హైందవ పురాణాల్లో ఉన్న యమధర్మరాజు-సావిత్రిల సంభాషణను గుర్తు చేశారు. సతీసావిత్రి భర్త ప్రాణాలను యమధర్మరాజు తీసుకుపోతుండగా, సావిత్రి అడ్డుపడటంతో ‘సావిత్రీ నీ పతి ప్రాణాలు తప్ప ఏదైనా వరం కోరుకో’ అనడాన్ని దాడి గుర్తు చేస్తూ, ఎసిబి నివేదికను సభకు అందచేయడం మినహా ఏదైనా చర్చిద్దామని ఆనం రామనారాయణరెడ్డి అంటున్నారన్నారు. ఈ మంత్రులు కూడా యమధర్మరాజు లాగా ఎంత కఠినాత్ములు అంటూ ఆనం వైపు చూస్తూ అన్నారు. దీంతో చైర్మన్ చక్రపాణి జోక్యం చేసుకుంటూ సతీసావిత్రి యమధర్మరాజు నుండి పొందిన వరం మేరకు ఏదోరకంగా తన భర్త ప్రాణాలను కాపాడుకోగలిగింది, అలాగే టిడిపి తమ డిమాండ్‌ను నెరవేర్చుకోవాలన్నారు. ఆనం రామనారాణయరెడ్డి జోక్యం చేసుకుంటూ దాడి ‘వీరభద్రరావు తనను ధర్మరాజు అంటున్నాడా? యమధర్మరాజు అంటున్నాడా?’ అంటూ ప్రశ్నించారు. దానికి దాడి స్పందిస్తూ మీరు సభ వెలుపల అయితే ధర్మరాజులాగే వ్యవహరిస్తున్నారు, కాని సభలోపల మాత్రం యమధర్మరాజులా వ్యవహరిస్తున్నారని చమత్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Relationship reasons for divorce
Mulayam says will support congress if needed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles