Ap minister continues indirect attack on cm kiran reddy

AP Minister continues indirect attack on CM Kiran Reddy,Dr. D.L.Ravindra Reddy M.L.A, Mydukur,DL Ravindra Reddy News, DL Ravindra Reddy Photos,,Mopidevi Venkata Ramana, CM Kiran kumar reddy,

AP Minister continues indirect attack on CM Kiran Reddy

CM.gif

Posted: 02/10/2012 10:09 AM IST
Ap minister continues indirect attack on cm kiran reddy

AP Minister continues indirect attack on CM Kiran Reddy ముఖ్యమంత్రి తన సామాజిక వర్గానికి చెందిన నేతను రక్షించుకోవటానికి మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు తీసుకున్న వ్యవహారంలో బలహీన వర్గానికి చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణను బలిపశువు చేశారని వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ డిఎల్‌ రవీంద్రారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. వాస్తవానికి మోపిదేవి చాలా మంచివాడని డిఎల్‌ కితాబిచ్చారు. సిఎల్‌పి కార్యాలయం వద్ద తనను కలిసిన విలేకరులతో డిఎల్‌ మాట్లాడారు. ఉన్నతస్థానాల్లో ఉన్న వారు కులాలు, మతాలకతీతంగా వ్యవహరించాలని, అంతే తప్ప తన సామాజిక వర్గానికి చెందిన వారు తప్పు చేస్తే వారిని రక్షించుకోవటానికి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వారిని బలిపశువు చేయటం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. మంత్రి మోపిదేవి చాలా బాధపడుతున్నారని, ఎవరి నుంచి లంచం తీసుకోలేదని పదే పదే చెప్పినా రిమాండ్‌ నివేదికలో ఆయన పేరును చేర్చారని, పైగా ఆ విషయాన్ని అదే శాఖను నిర్వర్తిస్తున్న ఎక్సైజ్‌మంత్రికే చెప్పి చేయటం సమంజసంగా లేదని డిఎల్‌ మండిపడ్డారు. పైగా మోపిదేవి గురించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా అన్యాయంగా మాట్లాడడం సరికాదని డిఎల్‌ అన్నారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌ ఎంపిక, ఇటీవల సమాచార హక్కు కమిషనర్ల నియామకం వ్యవహారంలో పల్లెత్తుమాట మాట్లాడకుండా వ్యవహరించిన తీరు ఎలా ఉందో, ఎవరెవరు ఎలా కుమ్మక్కవుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, అలాంటి బాబుతో తన సొంత నియోజకవర్గాన్ని కాపాడుకోవటానికి కుమ్మక్కై ముఖ్యమంత్రి బలహీనవర్గాలకు చెందిన మోపిదేవి లాంటి వారిని బలిపశువు చేస్త్తున్నారని ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iraq tribe blocks memorial for hanged qaeda member
Chandrababu naidu bike rally  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles