Gandra venkata ramana reddy

gandra venkata ramana reddy

gandra venkata ramana reddy

26.gif

Posted: 02/06/2012 09:19 PM IST
Gandra venkata ramana reddy

             gandra కొత్త మంత్రుల సంగతి ఇదిలా ఉండగా, ఇప్పటి వరకూ విప్ బాధ్యతలు నిర్వర్తించిన కొండ్రు మురళి సైతం మంత్రివర్గంలోకి చేరిపోవటంతో విప్ పదవులన్నీ ఖాళీ అయిపోయాయి. గతంలో చీఫ్ విప్ గా పనిచేసిన మల్లు భట్టి విక్రమార్క ఉప సభాపతిగా వెళ్లిపోవటంతో మురళి బాధ్యతలు నిర్వించిన సంగతి విధితమే. ఇప్పుడు ఆయన కూడా క్యాబినెట్ లో చేరిపోవటంతో ప్రభుత్వ చీఫ్ విప్‌ గా ఎవరొకరిని తప్పక నియమించాల్సిన పరిస్థితి.

            అయితే చీఫ్ విప్ పదవికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేరు దాదాపు ఖారారైనట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గంలో చోటు కల్పించలేక పోయిన నేపథ్యంలో గండ్రను చీఫ్ విప్‌గా నియమిస్తే బాగుంటుదని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన గండ్రను చీఫ్ విప్ పదవి వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

         సందట్లో సడేమియాలా ప్రభుత్వ విప్ పదవులకు బాల్కొండ ఎమ్మెల్యే అనిల్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ, నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, అద్దంకి గొట్టిపాటి రవికుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Insustice to ambedkar came out through ri
Ap cabinet expantion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles