Ap cabinet expantion

22.gif

Posted: 02/06/2012 09:09 PM IST
Ap cabinet expantion

        kondru_murali.jpeg తన మంత్రి వర్గాన్ని మరోమారు విస్తరించారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇందులో భాగంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఎస్ఎల్ నర్శింహన్ కొత్తగా నియమితులైన ముగ్గురు మంత్రులు చేత ఈ సాయంత్రం ప్రమాణస్వీకారం చేయించారు.         

         రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్, శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ ఎమ్మెల్యే కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు.

         కాగా, కొత్తగా మరో ముగ్గురు మంత్రుల చేరికతో తాజాగా మంత్రివర్గసభ్యుల సంఖ్య 41కి చేరుకుంది. ప్రసాదరావు, కొండ్రు మురళీమోహన్‌లు తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేయగా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి చిరంజీవితోపాటు, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gandra venkata ramana reddy
The great asian gold theft crisis  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles