Andhra pradesh

andhra pradesh, Andhra Pradesh Map, Districts of Andhra Pradesh, District map of Andhra Pradesh

andhra pradesh

andhra.gif

Posted: 01/27/2012 01:38 PM IST
Andhra pradesh

పట్టణీకరణలో రాష్ట్రం వెనుకబడిపోతోంది. గత దశాబ్దపు లెక్కల ప్రకారం పట్టణీకరణలో రాష్ట్రం 16వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 17వ స్థానానికి చేరింది. అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రంగా గోవా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని పట్టణాల్లో జనాభా పెరుగుతున్నా.. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పట్టణీకరణలో వెనుకబడే ఉంది.
రాష్ట్రంలో పట్టణీకరణ ఇంకా జరగాల్సిన అవసరాన్ని తాజా జనాభా లెక్కలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 33 శాతం మాత్రమే ఉంది. తమిళనాడులో 48.45 శాతం, కేరళలో 47.72, మహారాష్ట్రలో 45.23, గుజరాత్‌లో 42.58 కర్ణాటకలో 38.57, పంజాబ్‌లో 37.49, హర్యానాలో 34.79 శాతం పట్టణ జనాభా ఉంది. అత్యధిక పట్టణీకరణ జరిగిన మూడు రాష్ట్రాల్లో గోవా, మిజోరం, తమిళనాడు ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పెరగడం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార అవకాశాలు మెండుగా ఉండడంతోపాటు, కనీసం 75 శాతం మంది పురుషులు వ్యవసాయేతర పనులు చేస్తున్నవారై ఉంటేనే... ఆ ప్రాంతాన్ని పట్టణ ప్రాంతంగా పరిగణిస్తారు. అదే విధంగా చదరపు కిలోమీటర్‌కు 400 మంది జనాభా ఉండాలన్న నిబంధనలున్నాయి. రాష్ట్రంలో పట్టణ జనాభా 2001 లెక్కల ప్రకారం 2.08 కోట్లు ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం అది 2.83 కోట్లకు పెరిగింది. అదే సమయంలో గ్రామీణ జనాభా 5.54 కోట్ల నుంచి 5.63 కోట్లకు పెరిగింది. రాష్ట్ర జనాభా పదేళ్లలో మొత్తం 84.55 లక్షలు పెరిగితే ... అందులో ఒక్క పట్టణ ప్రాంతాల్లోనే 75.45 లక్షలు పెరగడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iits and the warangal nit
Child bites a snake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles