పాముని కొరికి చంపిన బాలుడి ఉదంతం ఉత్తర ఇజ్లాయిల్ లో వెలుగుచూసింది. స్ఫారమ్ గ్రామంలో ఇమద్ గాదిర్ అనే 1 సంవత్సరం వయసులోని పిల్లవాడు గదిలో ఆడుకుంటుండగా ఒక పాము వాడి చేతికి చిక్కింది. విషమున్న పాము కాదు కానీ ఆ పాము మనిషిని స్పృహ తప్పేట్టు చెయ్యగలదు, మెడ చుట్టు గట్టిగా పట్టుకుని ఊపిరాడకుండా చెయ్యగలదు, అలర్జీ కూడా రావొచ్చు కానీ విచిత్రంగా ఆ అబ్బాయికి ఏమీ కాలేదు. పైగా తల్లి వచ్చి చూసేసరికి ఆ పాము తలని నోటితో కొరుకుతూ కనిపించేసరికి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అయితే అప్పటికే ప్రమాద ఘడియలు తొలగిపోయాయి.
పిల్లలకుండే అలవాటు ప్రకారం తెలియకుండానే ఆ అబ్బాయి చేతికి దొరికిన పాముని తీసి నోటిలో పెట్టుకున్నాడని, అంతా యాదృచ్ఛికంగా జరిగిపోయిందని అక్కడికొచ్చిన పాములను పట్టుకునే మనిషి చెప్పాడు. పిల్లవాడిని హాస్పిటల్ చేర్చారు ఎందుకైనా మంచిదని.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more