Balayya ready to stand as apponent to chiru

balayya-1-2.gif

Posted: 01/23/2012 11:13 AM IST
Balayya ready to stand as apponent to chiru

balayyaతెలుగుదేశం పార్టీలో క్రియాశీల వ్యవహారాలనుచక్కబెడతానని, తన పూర్తి సహకారంతో పార్టీకి పూర్వవైభవం తీసుకునివస్తానని మాటిచ్చిన నందమూరి బాలకృష్ణ చెప్పినట్టుగానే ప్రచారంలో చురుగ్గా పనిచేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో నిన్న పాడేరులో రోడ్ షో నిర్వహించి, అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గిరిజనులతో సహపంక్తి భోజనాలు, వారితో కలిసి థింసా నృత్యాన్ని చేసారు. చిరంజీవితో పోటీ చెయ్యటానికి తాను సిద్ధమేనని, అయితే నిర్ణయమంతా అధిష్టానానిదేనని పార్టీ నిర్ణయం ప్రకారం తనని ఎక్కడ పోటీ చెయ్యమంటే అక్కడే చేస్తానని బాలయ్య మరోమారు ధృఢండా చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చినా తను సినిమా జీవితాన్ని విస్మరించనని కూడా బాలయ్య తెలియజేసారు. తనకి రాజకీయాలు, సినిమాలు రెండు సమానమేనని, ముప్ఫై సంవత్సరాలుగా తనని సినిమారంగంలో ఆదరించిన తెలుగువారు తనని రాజకీయ రంగంలో కూడా ప్రోత్సహిస్తారని బాలయ్య ఆశాభావాన్ని వెలిబుచ్చారు. తన సినిమా డైలాగుల వలన తెలుగు ఇంకా జీవం పోసుకుంటుండటం తనకి ఆనందంగా ఉందని, చిన్న పిలల్లు సైతం తన డైలాగులను చెప్తున్నారని బాలయ్య చెప్తూ అక్కడ కొన్ని సినిమా డైలాగులను కూడా వినిపించారు.

ఈరోజు విశాఖపట్నం ఎమ్ వి పి కాలనీలో జరిగే బహిరంగ సభకు ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి చిన్నవాల్తేరు సాగరతీరం నుంచి ర్యాలీగా బయలుదేరారు.  దారిలో ఇళ్ళల్లోంచి బయటకు ఎదురు వచ్చి స్వాగతం చెప్తున్నవారికి బాలయ్య విజయసంకేతాన్ని రెండు వేళ్ళతో చూపిస్తూ ముందుకెళ్ళారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Media drugging people with their news reports says justice katzu
Azad comes again and goes without agenda without meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles