సంక్రాంతిని తెలుగువారు పెద్ద పండుగగా పిలుస్తారు. పంట చేతికి రావటం, కొత్త అల్లుళ్ళు ఇంటికి రావటం, ఇంటి ముందు ముగ్గులు, ఇంటిలోపల హడావిడి, కొత్తబట్టలు, పిండివంటలు, బయటకు వెళ్తే కోడిపుంజుల పందేలు, గాలిపటాల పోటీలు ఇవి సరదాగా సాగే సంక్రాంతి పండుగలోని కొన్ని విశేషాలు.
భోగి మంటలు అందరికీ వెచ్చదనాన్నిస్తుంటే, కొత్తజంటకు ఆటవిడుపు. ఈ రోజు తర్వాత చలి తగ్గుతూ పగలు సమయం పెరుగుతూపోతుంది. చిన్నపిల్లలకు ఆట పాటలు, పెద్దవారికి పండుగ సందర్భంగా అందరినీ చూసిన సంతోషం. ఇలా మన పండుగలన్నీ కుటుంబంలోనివారంతా కలిసి గడపటానికి ఒక మిషగా కూడా పనికొస్తాయి.
ఈరోజు తెలుగువాళ్ళ ఇళ్ళల్లో చిన్నపిల్లలకు రేగిపండ్లతో కలిపి తలమీదినుంచి స్నానం చేయిస్తారు. సూర్యుని రథం ఉత్తరం దిక్కువేపు తిరిగిన దానికి సంకేతంగా ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. చాలా చోట్ల మగ్గుల పోటీలు కూడా పెడతారు. ముగ్గులు వెయ్యటం కూడా ఒక కళే. చిన్న కాగితం మీద గీయటం వేరు, పెద్ద ప్రదేశంలో రకరకాల డిజైన్లలో రంగవల్లులు దిద్దటం వేరు. పైగా రేఖల్లో పిండిని సమానంగా పడేటట్టుగా గీతలు గియ్యటానికి నేర్పు కావాలి, అంతసేపు కూర్చుని వెయ్యటానికి ఓర్పూ కావాలి.
సంక్రాంతి అనే పండుగ కేవలం మకర సంక్రాంతికే చేసుకుంటాం. సూర్యుడు మకరరాశిలోకి వెళ్ళే రోజిది. ఇలా సంవత్సరానికి సూర్యుడు ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లోకి వెళ్తాడు కాబట్టి సంవత్సరానకి నిజానికి 12 సార్లు జరుగుతాయీ అంటే సంక్రమణాలు- అంటే సంక్రాంతులు. కానీ మకర రాశిలోకి వెళ్ళినప్పుడు జరిగే ఈ మకర సంక్రాంతినే పండుగగా చేసుకుంటారు. కాలక్రమేణా మకర అన్నది వదిలేసి సంక్రాంతి అని పిలవటం మొదలుపెట్టారు.
పంచాంగాలన్నీ చాంద్రమానం ప్రకారం లెక్కకట్టినవి. అంటే చంద్రుడి కదలికలను ఆధారంగా చేసుకున్నవి. కానీ సంక్రాంతి మాత్రం సూర్యమానం ప్రకారం చేసుకునే పండుగ. అందుకే జనవరి 13, 14, 15 తేదీల్లో ఒక రోజున వస్తోంది. సూర్యుడు ఉత్తరదిశగా పయనించటానికి ఉపక్రమించిన రోజు అంటే ఉత్తరాయణం ప్రారంభమౌతుంది.
ఆంధ్రప్రదేశేతో పాటుగా ఈ సంక్రాంతి పండుగను ఇదే పేరుతో చేసుకునే ప్రదేశాలు- బీహార్, గోవా, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒరిస్సా, సిక్కిం, ఉత్తరప్రదేశే, ఉత్తరాంచల్, పశ్చిమ బెంగాల్ హర్యానా, పంజాబ్ రాష్టాలు. తమిళనాడులో పొంగల్ అని, గుజరాత్, రాజస్థాన్ లలో ఉత్తరాయన్ అని, కేరళలో శబరిమలై లో మకర విలక్కు పండుగ అని అంటారు. ఈరోజు అక్కడ మకరజ్యోతి దర్శనం చేసుకోవటానికి అయ్యప్ప మాలధారులంతా ఉత్సుకతను చూపిస్తారు. హిమాచల్ ప్రదేశ్ లో మాఘి అని, అస్సాం లో మాఘి బిహు లేక భోగాలి బిహు అని పిలుస్తారు. కాశ్మీర్ లో ఇదే శిశుర్ సేంక్రాంత్.
మన పొరుగు దేశాల్లో కూడా సంక్రాంతిని ఈ విధంగా చేసుకుంటారు. థాయ్ ల్యాండ్- సోంగ్క్రాన్, మైనమార్- థింగ్యాన్, కంబోడియా- మోహ సంగ్క్రాన్, లావోస్- పిమాలూ, నేపాల్ లో థారూ సమాజం వారు మాఘి అని ఇతర సాంప్రదాయాల్లో మాఘే సంక్రాంతి అని అంటారు.
శాస్త్రాలన్నిటినీ కథల రూపంలో చెప్పే అలవాటున్న మన పురాణాల్లో సూర్యభగవానుడు తన కుమారుడు శని ని కలిసే రోజుగా చెప్తారు. శని మకర రాశికి అధిపతి. ఉత్తరాయణంలో బయలుదేరే సంక్రాంతి నుంచి దేవతల రాత్రులుగానూ, దక్షిణాయనాన్ని అసురుల రాత్రులుగాను పరిగణిస్తారు. మహాభారత కథలో ఇచ్ఛామరణ వరం పొందిన భీష్ముడు అంపశయ్యమీద ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే ఎదురుచూస్తుంటాడని చెప్పటం జరిగింది. గురునానక్ పరంపరలో పదవ గురువైన గురు గోవింద్ సింగ్ ఈరోజున 40 మంది సిక్కులకు ముక్తిని ప్రసాదించారని చెప్తారు.
ఈ భోగి సంక్రాంతులు అందరికీ భోగభాగ్యాలను, సుఖసంతోషాలను కలుగజేయాలని కోరుతూ - తెలుగు విశేష్
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more