List of dcc presidents to be out soon

PCC chief Botcha Satyanarayana has said he will announce in a few days the first list of those appointed president of.

PCC chief Botcha Satyanarayana has said he will announce in a few days the first list of those appointed president of.

DCC presidents to be out soon.gif

Posted: 12/25/2011 03:29 PM IST
List of dcc presidents to be out soon

రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు డీసీసీ, మూడు నగర కార్పొరేషన్లకు అధ్యక్షుల ఎంపికను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆయా జిల్లాల జాబితాను ఏఐసీసీ ముందుంచి ఆమోదముద్ర కూడా వేయించుకున్నారని సమాచారం. ఒకటి రెండ్రోజుల్లో ఆ జాబితాను ప్రకటించాలని బొత్స నిర్ణయించారు. జిల్లాల వారీగా వివరాల కొస్తే మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, అనంతపురం డీసీసీ అధ్యక్షుల ఎంపిక కొలిక్కి వచ్చింది.పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మొన్నటివరకు మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు.

మళ్లీ ఆయననే తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు. మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షునిగా ఒబేదుల్లా కొత్వాల్, నల్లగొండ డీసీసీ అధ్యక్షునిగా ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం. విజయనగరం డీసీసీ అధ్యక్షునిగా కొలగట్ల వీరభద్రస్వామి, పశ్చిమగోదావరి డీసీసీ అధ్యక్షునిగా గోకరాజు రంగరాజులనే తిరిగి కొనసాగించనున్నారు. ప్రకాశం జిల్లా డీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాలని ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఉగ్రనరసింహారెడ్డిలను కోరినప్పటికీ వారు తిరస్కరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోతుల రామారావునే తిరిగి కొనసాగించాలని బొత్స నిర్ణయించినట్లు సమాచారం. తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షునిగా వెంకటేశ్వరరావు, అనంతపురం డీసీసీ అధ్యక్షునిగా గుంతకల్ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sleeping on left side of the bed
Atal bihari vajpayee helth critical  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles