డిసెంబర్ 25 వస్తున్నదంటేనే పాశ్చాత్యదేశాల్లో పండుగరోజులు మొదలవుతాయి. బీదా బిక్కీ, చిన్నా ముతకా ఎవరైనా సరే ఈ పండుగ సందర్భాన్ని పోగొట్టుకోదలచుకోరు. వైషమ్యాలను వదిలి సాధ్యమైనంత వరకూ కుటుంబ సభ్యులతోనూ స్నేహితులు బంధువులతోనూ సరదాగా హాయిగా సంతోషంగా గడిపేద్దామనే చూస్తారు. క్రిస్ట్ మస్ మహాత్యమది. ఈ ఆనవాయితీ బ్రిటిష్ పాలించిన దేశాలలోకి రావటమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శలవుదినంగా ప్రకటించటం మొదలైంది. క్రిస్ట్ మస్ సందర్భంగా కొత్త బట్టలు కొనుక్కోవటం, ఇల్లంతా అలంకరించటం, సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవటం అన్నిచోట్లా ఘనంగా జరుగుతాయి.
నాల్గవ శతాబ్దం ప్రారంభ కాలంలో డిసెంబరు 25ని క్రిస్ట్ మస్ గా ఏసు క్రీస్తు జన్మదినంగా మొదటిసారిగా వెస్ట్రన్ క్రిస్టియన్ చర్చ్ వారు ఘోషణ చేసారు. ఈస్ట్రన్ క్రిస్టియానిటీ ప్రకారం జనవరి 6 ను క్రీస్తు జన్మదినంగా భావించి జనవరి 7 న క్రిస్ట్ మస్ పండుగ చేసుకుంటారు. అందుకే జూలియన్ కాలెండర్ ప్రకారం డిసెంబరు 25 నుండి చేసుకునే ఈ పండుగరోజులను 12 రోజుల పండుగగా గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారం జనవరి 7 నుంచి 19 వరకు రష్యా, ఉథోపియా, ఉక్రయిన్ దేశాలు చేసుకుంటాయి.
తేదీలు ఏవైనా, పండుగ మాత్రం అందరికీ ఒకటే. క్రిస్టమస్ జన్మదినాన్ని వేడుకగా జరుపుకోవటం. ఆ సమయంలో వీలయినంతగా సరదాగా గడిపేయటం. దానికోసం, బహుమతులను ఒకరికొకరు ఇచ్చుకోవటం, శుభాకాంక్షలు తెలుపుకుంటూ క్రిస్ట్ మస్ కార్డులను ఇచ్చుకోవటం, వాతావరణాన్ని సంగీతంతో నింపుకోవటం, ఇళ్ళల్లో, చర్చిల్లో అలంకరణలలో భాగంగా క్రిస్ట్ మస్ ట్రీ, దీపాలంకరణ మొదలైనవి చెయ్యటం, మంచి భోజనం, శాంతాక్లాజ్ లేక ఫాదర్ క్రిస్ట్ మస్, లేదా సైంట్ నికోలస్, లేక, క్రిస్ క్రింగల్ వేషధారణతో చిన్నపిల్లలకు బహుమతులందించటం జరుగుతుంది. ఇది అందరికీ పండుగే. వస్తువులు కొనేవారికి, వస్తువులను విక్రయించే హోల్ సేల్ రిటైల్ వ్యాపారులకు కూడా. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో ఈ పండుగ రోజుల్లోనే అధిక విక్రయాలు జరుగుతాయి.
గోస్పెల్ ఆఫ్ మాథ్యూ, గోస్పెల్ ఆఫ్ ల్యూక్ ప్రకారం, బెత్లహామ్ లో మేరీ అనే కన్యకు జీసస్ క్రిస్ట జన్మించాడు. ఆ ప్రసవ సమయంలో ఆమె భర్త జోసెఫ్ ఆమెకు సాయపడతాడు. బెత్లహామ్ పరిసరాల్లోని పశులకాపరులకే ముందుగా ఒక దేవత గర్భాన శిశువు జన్మించాడన్న వార్త తెలియటం వలన ఏసుక్రీస్త్ ను ముందుగా చూసినవారు వారే అయ్యారు. ఆ తర్వాత ఎంతో మంది జ్యోతిష్యులు ఆకాశన పుట్టిన కొత్త నక్షత్రాన్ని కనిపెట్టి దాని ద్వారా వెతుక్కుంటూ ఆ కుటుంబం ఉన్న ఇంటికి చేరుకుని, ఎన్నో బహుమతులను ఇస్తారు. ఆ తర్వాత ముగ్గురు రాజులు లేక పండితులు కూడా బాల ఏసు దర్శనం చేసుకున్నారట.
చరిత్రలోని ఆధారాల ప్రకారం, నాల్గవ శతాబ్దపు చివర్లో బహుశా క్రీ.శ.388 నుండి డిసెంబరు 25 ని క్రిస్ట్ మస్ వేడుకలను చేసుకోవటం మొదలుపెట్టారు. జనవరి 6న క్రిస్ట్ మస్ వేడుకలను చేసే తూర్పు దేశాలు కూడా కొన్ని డిసెంబరు 25నే అనుసరించటం మొదలుపెట్టాయి.
న్యూ టెస్టామెంట్ లో డిసెంబరు 25ని క్రిస్ట్ జన్మదినంగా చెప్పలేదు. విందుచేసుకోవలసిన దినంగా కూడా ప్రకటించలేదు. 303 వ సంవత్సరంలో క్రిస్టియన్ రచయిత అర్నోబియస్, క్రిస్ట్ జన్మదినాన్ని చేసుకోవటాన్ని తప్పు పట్టారు. దేవుడికి జన్మదినమేమిటని ఆయన వాదన. 311 వ సంవత్సరం నుంచీ దేవుడి పుట్టుకగా కాకుండా మానవుడి పుట్టకగా వేడుకలు చేసుకోవటం మొదలుపెట్టారు.
క్రిస్ట్ మస్ పండుగ మొదట్లో వివిధ సంఘాల నుండి ఎన్నో వివాదాలను ఎదుర్కుని చివరకు సర్వసమ్మతమైన పండుగగా నిలిచింది. క్రిస్ట్ జన్మతో ముడిపడి, విశ్వవ్యాప్తంగా అందరం పాటిస్తున్న కాలెండర్ ప్రకారం చూస్తే క్రిస్ట్ జననాన్ని నాల్గవ శతాబ్దంలో వెనక్కి గుణించుకుంటూ పోయి నిర్థారించటం జరిగింది.
ఆధునిక యుగంలోని జీవన వేగంలో అటువంటి వివాదాలకు సమయంలేకపోవటం మంచిదే అయింది. క్రిస్ట్ జననాన్ని డిసెంబరు 25ని చేసుకుంటున్నామంతే. విశ్వశాంతి కోసం మానవ కళ్యాణం కోసం, దయ, కరుణ, సహనం, క్షమా గుణాలను మానవాళికి అందించిన మహానుభావుడి జన్మదినాన్ని అందరం చేసుకోవటం సమంజసం.
క్షమాగుణంలో పరాకాష్టత చూపించినవాడే ఏసుక్రీస్తు. దీన్ని అర్థం చేసుకోవటానికి తార్కికమైన ఆలోచనా సరళి అవసరం. క్షమించగలిగేవాడెవరంటే నష్టపోయినవాడే. మిగతావారికి ఆ యోగ్యత లేదు. నాకు నష్టం కలిగిందంటే క్షమిస్తే నేను క్షమించాలి కానీ మరొకరు కాదు. ఆ క్షమించటంలో కూడా చిత్రహింసలు పెడుతూ మనిషి మనుగడకు ముఖ్యమైన ప్రాణాలనే హరిస్తున్నవారిని క్షమించటం, క్రీస్టుని శిలువ చెయ్యటానికి ఉపయోగించే శిలువను కొరడాలతో కొట్టుకుంటూ ఆయనచేతనే కొండపై వరకూ మోయించుకుంటూ పోయారు. అన్నిటికన్నా ముఖ్యం క్రీస్ట్ దైవపుత్రుడు. దేవుడి పుత్రుడినే చిత్రహింసలకు గురిచెయ్యటం, ప్రాణాలు తీయటం కన్నా గొప్ప అపచారం మరొకటి లేదు. అతి పెద్ద తప్పు అది. దీన్నే హిందూ ధర్మంలో బ్రహ్మహత్యాపాతకం అంటారు. దాన్ని మించిన అపరాధం మరొకటి లేదు. ప్రపంచంలోనే అతి పెద్దదైన తప్పిదాన్ని దాన్ని అనుభవించినవారే క్షమించగలరు. అందుకే ఆ బాధ్యత దేవుడు ఏసుక్రీస్తుకిచ్చాడు. తనని బాధలు పెడుతున్నవారిని కనీసం నోరు విప్పి తిట్టకపోగా, వాళ్ళు అమాయకులు, వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళని క్షమించు దేవా అంటూ దేవుడిని వేడుకోవటం అనేది అతి గొప్ప క్షమాగుణ ప్రదర్శన. అంతటి క్షమాగుణాన్ని ప్రదర్శించటం కోసమే ఆ సన్నివేశమంతా రచించబడింది.
అందుకే ఈ క్రిస్ట్ మస్ వేడుకల్లో శత్రువులు కూడా కలిసిపోతారు. ఆనందాన్ని పంచుకోవటమే ఈ పండుగ ఉద్దేశ్యం.
Teluguwishesh Wishes All A Merry Christmas
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more