ఈరోజు ఎన్నికల కమిషన్ ఆఫీసు నుంచి ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేశి 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసారు. మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలలో ఒకే విడతలోనూ, ఉత్తరప్రదేశ్ లో 7 విడతలు గానూ జరగనున్న ఎన్నికలు, ఈ క్రింది తేదీల్లో జరుగుతాయి.
మణిపూర్ లో 60 స్థానాలకు జనవరి 28, 2012 న, ఉత్తరాఖండ్, పంజాబ్ లలో 170 స్థానాలకు జనవరి 30, 2012న, గోవా లో 40 స్థానాలకు మార్చి 3, 2012న ఎన్నికలు జరుగుతాయి.
ఉత్తర ప్రదేశ్ లోని స్థానాలు 403 కాబట్టి 7 దశలుగా ఎన్నికలు జరుగుతాయి. అవి వరసగా ఫిబ్రవరి 4, 8, 11, 15, 19,23, 28 తేదీల్లో జరుగుతాయి.
ఉప ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఉన్న 7 ఖాళీల విషయంలో అడగగా, ఇంకా ఇతర రాష్ట్రల్లో కూడా ఉప ఎన్నికల అవసరం ఉందని, వాటిమీద ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఎన్నికల కమిషన్ చెప్పారు.
ఎప్పిటిలాగానే పోలీసు భద్రతలు, ఇవిఎమ్ ల ఏర్పాట్లుంటాయి, ఎన్నికల సమయంలో డబ్బు కదలికలను పరిశీలించటం, ఇతర సాధారణ ఎన్నికల కోడ్ ఎలాగూ జరుగుతుంది. ఇది కాకుండా ఎన్నికలు సజావుగా జరగటం కోసం ఈసారి కొత్తగా రెండు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకటి, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికలకోసం ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఖాతాను తెరిచి ఎన్నికల ఖర్చునంతా అందులోంచే చెయ్యాలి. రెండవది ఎన్నకల ముందు, ఎన్నికల సమయంలో ఎవరైనా ఏదైనా సమాచారాన్ని అందించటం కోసం కానీ, ఇతర సందేహ నివృత్తి కోసం కానీ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కి ఫోన్ చెయ్యవచ్చు. దాని నంబర్ 1950. 1950 వ సంవత్సరంలో జన్మించిన ఎన్నికల కమిషన్ కి గుర్తుగా ఈ నంబర్ ని కాల్ సెంటర్ కి కేటాయించటం జరిగిందని ఎన్నికల కమిషనర్ తెలియచేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more