Celebrating 100 years of national anthem

The National,National Anthem,Indian National Congress,fast,Corruption,Anna Hazare,100

A century later, the irony is unmistakable as the nation wages a second struggle for freedom from corruption , the enemy within.

Celebrating 100 years of national anthem.gif

Posted: 12/25/2011 12:20 PM IST
Celebrating 100 years of national anthem

Janaganamanaమనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 60 సంత్సరాలు దాటింది. కానీ మన జాతీయ గీతానికి మాత్రం వందేళ్ళు నిండబోతున్నాయి. తొలిసారిగా మనకు స్వాతంత్ర్యం రాక ముందు 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా జనగణమన పాడారు. నూరేళ్లు గడచినా ఇది నిత్య నూతనం, అదే మాధుర్యం, అదే పారవశ్యం. ఈ పవిత్ర జాతీయ గీతం జన గణంలోకి ప్రవహించి... ఎల్లుండికి సరిగ్గా వందేళ్లు. వందేళ్ల జనగణమన విశేషాలు కొన్ని మీ కోసం...

ఆసేతు హిమాచలాన్ని ఇముడ్చుకున్న గీతం 'జనగణమన'. వందేళ్ల నిత్య నూతన గీతం జనగణమన. మన జాతీయ గీతం గురించి చెప్పుకోవాలంటే ఎన్నో విశేషాలున్నాయి. అందులో కొన్ని ఇవి... * బెంగాలీ బాబు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత గీతమిది. సంస్కృత సమ్మిళతమైన (తత్సమ) బెంగాలీలో దీనిని రచించారు.
* జనగణమనను మొట్టమొదటిసారిగా 1911 డిసెంబర్ 27న కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు.
* రాజ్యాంగ సభ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా ఆమోదించింది.
* 'జనగణమన'ను భారత దేశ సుప్రభాత గీతం (ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా)గా రవీంద్రుడు అభివర్ణించారు.
* జనగణమనలో ఐదు చరణాలు ఉన్నప్పటికీ... అప్పటి పరిస్థితుల కారణంగా మొదటి చరణాన్ని మాత్రమే జాతీయ గీతంగా స్వీకరించారు.
* ప్రస్తుతం మనం పాడుకుంటున్న జనగణమనకు రామ్‌సింగ్ ఠాకూర్ సంగీతాన్ని అందించినట్లు చెబుతారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
* జనగణమన పాడేందుకు 52 క్షణాల సమయం పడుతుంది. మొదటి, చివరి పంక్తులు మాత్రమే ఉన్న సంక్షిప్త రూపాలాపనకు దాదాపు 20 క్షణాలు పడుతుంది.
* 'వందేమాతరం' జనగణమనకంటే ముందే పుట్టింది. బ్రిటిష్ వ్యతిరేక గీతంగా... స్వాతంత్య్రోద్యమ నినాదంగా జనంలోకి వెళ్లింది.
* అప్పట్లో... వందేమాతర గీతం ఆలపించడం రాజద్రోహం. జనగణమనను మాత్రం బ్రిటిష్ పాలకులు గౌరవించేవారు.
* స్వాతంత్య్రానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో, స్కౌట్ బృందాలలో జనగణమనను ఆలపించేవారు.
* జనగణమనపై బ్రిటిష్ పాలకులకు అంత గౌరవం ఉండటానికి కారణం... ఇది జార్జి-5 పట్టాభిషేక సమయంలో ఆయనను కీర్తిస్తూ రచించారనే ప్రచారం జరగడమే!
* అప్పటికి భారత జాతీయ కాంగ్రెస్ కూడా బ్రిటిష్ పాలకులపట్ల విధేయత ప్రదర్శించేది. రాజుకు, రాణికి భారత్‌లోకి స్వాగతం పలుకుతూ కలకత్తా సమావేశంలో ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించారు.

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంత్యుత్సవాలు జరుగుతున్న సమయంలోనే.. ఆయన రాసిన 'జనగణమన'కు శతవర్షాలు నిండాయి. ఈ సందర్భంగా మంగళవారం ముంబైలో షణ్ముఖానంద సంగీత సభ విద్యార్థులు 'జనగణమన' పూర్తి పాఠాన్ని ఆలపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cabinet expand by month end
Christmas festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles