Chiranjeevi has expressed his displeasure with congress party

chiranjeevi, congress, kiran kumar reddy, hyderabad, botsa, Azad, soniya ghandhi, rahul, pcc, satyanarayana.

Prajarajyam party MLA Chiranjeevi has expressed his displeasure with Congress party.Erstwhile Praja Rajyam chief K. Chiranjeevi and his team dropped a bombshell.

Chiranjeevi.GIF

Posted: 12/04/2011 11:32 AM IST
Chiranjeevi has expressed his displeasure with congress party

Chiranjeevi has expressed his displeasure with Congress partyతెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఇదే అదనుగా భావించి కాంగ్రెస్ అధిష్టానంతో, కిరణ్ సర్కార్ తో ఓ ఆట ఆడుకుంటున్నాడు. అవిశ్వాసం పై ధీమాగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి చిరంజీవి ఝలక్ ఇచ్చారు. తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన చిరు ఇప్పుడు కాంగ్రెస్ తో ఆటాడుకుంటున్నాడు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులను తిరిగి రాబట్టుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిరు షాక్ ఇచ్చాడు. తన పార్టీ శాసనసభ్యులకు విప్ జారీ చేయడానికి ఆయన వెనకంజ వేస్తున్నారు. తనకు స్పష్టమైన హామీ ఇస్తే తప్ప విప్ జారీ చేయబోనని ఆయన అంటున్నారు. తమను నమ్ముకున్న ఎమ్మేల్యేలకు అన్యాయం జరుగుతుందని, తమను పార్టీలో గడ్డి పోచల్లా చూస్తున్నారని, విప్ జారీచేసే అంశం తరువాత చూద్దామని తేల్చి తెప్పారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రంగంలోకి దిగారు. తాను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూనే తన వర్గం శాసనసభ్యులు మాట వినడం లేదనే పద్ధతిలో చిరంజీవి మాట్లాడుతున్నారు. చిరంజీవితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. తన నివాసానికి వచ్చిన బొత్సతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల ఆవేదనను తెలియజేశారు.
ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఆవేదన న్యాయమైందేనని బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులను చిన్నచూపు చూడబోమని, ఇచ్చిన హామీలను పార్టీ అధిష్టానం నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. అయినా విప్ జారీ చేయడానికి చిరంజీవి సముఖత వ్యక్తం చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood actor dev anand dies
Kanimozhi reaches chennai says will prove innocence  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles