Will punish those behind cash for vote says gadkari

Will punish those behind cash for vote says Gadkari,Bharatiya Janata Party, cash-for-vote scam, Gadkari,

Will punish those behind cash for vote says Gadkari

bjp party vote.GIF

Posted: 11/20/2011 01:07 PM IST
Will punish those behind cash for vote says gadkari

 BJP awarded ఓటుకు నోటు స్కామ్ అసలు దోషులను తాము అధికారంలోకొచ్చాక జైలుకు పంపుతామని బీజేపీ అగ్రనేతలు ఉద్ఘాటించారు. అసలు దోషులను పట్టుకుని శిక్షించాలని, లేకపోతే తాము అధికారంలోకొస్తే వారికి జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ స్కాంపై ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు. ఎంపీల కొనుగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేసి ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడిన తమ పార్టీ నేతలకు ‘పద్మ’ అవార్డులు ఇవ్వాలన్నారు. ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలైన బీజేపీ ఎంపీ అశోక్ అర్గల్, మాజీ ఎంపీలు ఫగ్గన్ సింగ్ కులస్థే, మహావీర్ భగోరా, కాలమిస్టు సుధీంద్ర కులకర్ణి, సుహైల్ హిందుస్థానీలను శనివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, బీజేపీ అధ్యక్షుడుగడ్కారీ, మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు సత్కరించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటులో నోట్ల కట్టను ప్రదర్శించి ఎంపీల కొనుగోలును బయటపెట్టిన వారికి పద్మ అవార్డులతో సత్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాగా ఈ స్కాంలో బీజేపీ నేతలు అద్వానీ, అరుణ్‌జైట్లీలు ప్రధాన కుట్రదారులని ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ నిరుపమ్ పాట్నాలో ఆరోపించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajs first written test for poll candidates
China warning to america  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles