రోజువారిగా నిర్వహించుకునే కార్యకలాపాలలో కొన్ని ప్రణాళికబద్ధమైన మార్పులను తెచ్చుకుంటే.. రోజంతా అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడపచ్చు. అదెలా అంటే... అందాన్ని పొందడం కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ముఖంపై చిరునవ్వు లేకపోతే సహజ అందమే వుండదు. అందం కోసం ప్రత్యేకంగా మేకప్ లు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనసులో వుండే మానసిక భావాలు, ఒత్తిళ్లను చిరునవ్వుతో దూరం చేసుకుంటే చాలు.. మానసికంగా ఆరోగ్యంగా వుండటమే కాకుండా అందమైన లుక్ ని కూడా మీరు సొంతం చేసుకోవచ్చు.
అంతేకాకుండా శాస్త్రజ్ఞులు కూడా తమ పరిశోధనల ద్వారా ఇదే విషయాన్ని వెల్లడించారు. అలాగే సమయానుసారంగా రోజూ వ్యాయామం చేయడం ద్వారా కూడా శరీరాకృతిని అదుపులో వుంచుకుంటూ.. శరీరంలో వున్న కొవ్వును కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ సహజ అందమైన చిట్కాలను మనం కూడా ఒకసారి తెలుసుకుందాం...
అందమైన లుక్ ను సొంతం చేసుకవడానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన మార్గాలు :
1. అమ్మాయిలకు సాధారణంగా ప్రతిక్షణం అద్దంలో చూసుకునే అలవాటు వుంటుంది. అయితే ఆ అలవాటు చాలా మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే.. అద్దంలో తమ అందాన్ని చూసుకుంటూ చిరునవ్వు నవ్వడం వల్ల మనసులో వున్న బాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆ సమయంలోనే మీలో వున్న ఆ సంతోషకర భావాలను ఉత్తేజపరచడానికి ఎండోర్ఫిన్స్ హార్మోన్లు కూడా విడుదలవుతాయి. దీంతో మీరు సహజ అందాన్ని పొందడంతోపాటు ఆరోగ్యంగా కూడా వుండొచ్చు.
2. యూరోపియన్లు తాజాగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. నిటారుగా కూర్చున్న వ్యక్తులకు మంచి అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. నిటారుగా కూర్చోవడం వల్ల శరీర వివిధ భాగాల నుంచి మెదడుకు అందాల్సిన సమాచారం వేగవంతంగా జరుగుతుంది. దాంతో వ్యక్తులు మరింత చురుకుగా పనులలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. అలాగే శరీరానికి సంబంధించిన రోగాలు కూడా దూరమవుతాయి. చర్మంలో వుండే కణాలు కూడా ఉత్తేజితమవడంతో కాంతివంతమైన చర్మాన్ని కూడా పొందుతారు.
3. ప్రతిరోజూ సమయానుకూలంగా యోగా చేయడం ఒక మంచి పద్ధతి. యోగా వృద్ధాప్య చర్యకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. యోగాతో మన శరీరం, మనస్సును సమతౌల్యంగా అదుపులో చేయవచ్చు. మనసులో వున్న భావాలను బయటకు వదిలేసి తాజా శ్వాసను పీల్చడం ద్వారా ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. అది ఆరోగ్యంగా వుంచడమే కాకుండా.. అందానికి సంబంధించిన జుట్టు, చర్మం వంటి వాటిని కూడా నిర్జీవం కాకుండా శాశ్వతంగా వుంటుంది. యోగాలో పలు రకాలు కూడా వున్నాయి. అందులో ముఖ్యంగా ఒక కాలు మీద నిలబడి యోగా చేస్తే.. మంచి జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.
4. ప్రతిఒక్కరు తమకు నచ్చిన పాట వినబడగానే అనుకోకుండా డాన్స్ చేయడం మొదలుపెట్టేస్తారు. అలా చేయడం ఎంతో ఆరోగ్యకరమని కూడా నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇలా చేయడంతో శరీరంలో వున్న అవయవాలు, ఇతర భాగాలు కదలిక చెంది నిద్రపోతున్న స్థితి నుంచి ఉత్తేజితమవుతున్నట్లుగా ఫీల్ అవుతాయి. అలాగే రక్తప్రసరణ కూడా సరైన స్థితిలో జరిగి.. శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది. అలాగే సౌందర్యానికి సంబంధించిన పోషకాలు విడుదలయి.. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి.. ప్రకాశవంతమైన చర్మాన్ని మీకు అందిస్తాయి.
ఇలా ఈ విధంగా మీరు సాధారణ ఆరోగ్య మార్గాలతో మీ శరీర అందాన్ని, ఆకృతిని అదుపులో వుంచుకుంటూ.. ఎంతో ఆరోగ్యంగా వుండొచ్చు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది ఇంటి నుంచి బయటకు రావడమే మానేస్తారు. వేసవిలో భూమి, సూర్యునికి కొద్ది దగ్గరగా వెళతాడు. దాంతో సూర్యుని ప్రతాపం భూమి ఎక్కువ అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు... Read more
May 14 | కళ్లు... మహిళల అందాలను మరింత ఆకర్షణీయంగా పెంపొందించడంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సాధారణంగా మహిళలు తమ హావభావాలను కూడా ఈ కళ్ల ద్వారా వెల్లడిస్తారు. అమ్మాయిల అందం సాధ్యమైనంతవరకు కళ్ల మీదే ఆధారపడి... Read more
Apr 24 | పెళ్లికానున్న ప్రతిఒక్క మహిళ తాను ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటుంది. దానికి సంబంధించిన రకరకాల పద్ధతులను కూడా అవలంభించుకుంటారు. చర్మం నిగనిగలాడేందుకు, జుట్టు రాలకుండా వుండేందుకు, చేతులు మృదువుగా కనిపించేందుకు... ఇలా రకరకాలుగా... Read more
Apr 22 | సాధారణంగా కళ్లద్దాలను కంటిలోపం వున్నవారు, ఇన్ఫెక్షన్ వున్నవారు వాడుతారు. కానీ ప్రస్తుతకాలంలో కూడా ఈ కళ్లద్దాలను వాడటం ఒక ట్రెండ్ అయిపోయింది. అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాల కళ్లద్దాలు కూడా మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. ఇవి... Read more
Apr 07 | అందం విషయంలో మహిళలు ఏం చేయడానికైనా వెనుకాడరు... ఎంత డబ్బు వెచ్చించడానికైనా వారు సిద్ధంగా వుంటారు. నలుగురిలో తమ పర్సనాలిటీని అందంగా మార్చుకోవడానికి ఎటువంటి పద్ధతులనైనా అనుసరిస్తారు. అమ్మాయిలు అందంగా కనిపించడంలో జుట్టు పాత్ర... Read more