వెయిట్ లిప్టింగ్ లో ప్రపంచ చాంఫియన్ మీరాభాయ్ చాను ఈ సారి అసియా గేమ్స్ కు దూరంగా వుండనుంది. తనకు కలిగిన గాయమే ఇందుకు కారణమని తెలిపింది. గాయం కారణంగా ఫిట్ నెస్ సరిగ్గాలేదని.. దీంతో త్వరలో ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు భారత దేశం తరపున అడేందుకు వెళ్లడంలేదని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె భారతీయ వెయిట్ లిప్టింగ్ సమాఖ్యకు లెటర్ రాసిది. ప్రస్తుతం తాను ఫిట్ గా లేనని..తనకు రెస్ట్ ఇవ్వాలంటూ లెటర్ ద్వారా తెలిపింది. వెన్ను నొప్పి వల్ల ఆసియా గేమ్స్ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది చాను.
డైరెక్ట్ గా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి ప్రిపేర్ కావాలని భావిస్తున్నట్లు తెలిపింది. 2017లో అమెరికాలో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ లో చాను.. 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల భారత చీఫ్ కోచ్ విజయ్ శర్మ కూడా చానుపై అనుమానాలు వ్యక్తం చేశారు. జకర్తాలో జరిగే ఆసియా గేమ్స్ లకు చాను దూరంగా ఉండడమే బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. గుర్తు తెలియని వెన్నునొప్పితో చాను బాధపడుతున్నట్లు చీఫ్ కోచ్ చెప్పారు.
Owing to a backache, Indian weightlifter Mirabai Chanu pulls out of 18th edition of Asian Games
— ANI Digital (@ani_digital) August 7, 2018
Read @ANI story | https://t.co/FZL6xVk0qW pic.twitter.com/kpqaX5ZxAm
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more