Shreyasi Singh wins Double Trap Gold షూటింగ్ విభాగంలో స్వర్ణంతో మెరిసిన శ్రేయసీ సింగ్..

Commonwealth games 2018 shreyasi singh wins double trap gold

commonwealth games 2018, Australia, Shreyasi Singh, INDIA, shooting, CWG, Full List of Winners, Gold Medalists, Indian Winners, Weightlifting, sports

An exemplary performance by Indian shooter Shreyasi Singh, who shot her career-best score to clinch the gold medal in the women’s double trap final. Singh beat Australia's Emma Cox to take the top spot.

షూటింగ్ విభాగంలో స్వర్ణంతో మెరిసిన శ్రేయసీ సింగ్..

Posted: 04/11/2018 06:08 PM IST
Commonwealth games 2018 shreyasi singh wins double trap gold

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా సంగ్రామంలో భారత్ ఇవాళ మరో స్వర్ణ పతకం గెలుచుకుంది. మహిళల డబుల్‌ ట్రాప్‌ షూటింగ్‌లో భారత షూటర్ శ్రేయసి సింగ్‌ స్వర్ణ పతకం సాధించింది. నాలుగు రౌండ్ల పాటు ఆస్ట్రేలియాకి చెందిన ఎమ్మా కాక్స్‌, శ్రేయసి సింగ్‌ల మధ్య పోటీ జరగ్గా 96 పాయింట్లతో ఇద్దరూ సమానంగా నిలిచారు. దీంతో వీరిద్దరూ మళ్లీ షూటాఫ్‌కి వెళ్లాల్సివచ్చింది. ఈ సందర్భంగా భారత షూటర్ రెండు సార్లు టార్గెట్‌ని హిట్ చేయగా... ఎమ్మాకి ఇచ్చిన రెండు షూట్లలో ఒక్కటే హిట్ సాధించింది. దీంతో శ్రేయసికి స్వర్ణం ఖరారైంది.
 
నాలుగురౌండ్లలో  87 పాయింట్ల సాధించిన స్కాట్‌లాండ్‌కి చెందిన లిండా పియర్సన్‌ కాంస్య పతకం దక్కించుకుంది. కాగా చివరి రౌండ్ వరకు పతకం కోసం రేస్‌లో ఉన్న భారత షూటర్ వర్ష వర్మన్ 86 పాయింట్లతో వెనుక బడడంతో నిరాశ తప్పలేదు. తాజా కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇప్పటి వరకు భారత్‌కు మొత్తం 23 పతకాలు దక్కాయి. అందులో 12 స్వర్ణం, 4 రజతం, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది.

ఇక మరోవైపు స్వర్ణ పతకాన్ని టార్గెట్ చేసుకున్న భారత హాకీ జట్టుకు కూడా అదే దిశగా పయనిస్తోంది.  గ్రూప్-బి లీగ్ లో లాస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 4-3 తేడాతో ఇంగ్లీష్ టీమ్ పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి హోరా హోరిగా సాగిన మ్యాచులో టీమిండియా త్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మ్యాచ్ ముగిసే టైంకి రెండు మూడు గోల్స్ తో లీడ్ లో ఉన్న ఇంగ్లండ్ కు భారీ షాక్ ఇచ్చింది భారత్. చివరి రెండు నిమిషాల్లో మరో రెండు గోల్స్ కొట్టి స్కోర్ ను 4-3 తో లీడ్ లోకి తెచ్చింది. గ్రూప్-B లాస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది హాకీ ఇండియా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : commonwealth games 2018  Australia  Shreyasi Singh  Emma Cox  INDIA  shooting  sports  

Other Articles