Winter Olympics 2018 opening ceremony కన్నుల పండువగా ప్రారంభమైన వింటర్ ఒలంపిక్స్

Winter olympics 2018 opening ceremony yuna kim lights the torch

2018 Winter Olympics, Winter Olympics 2018, North Korea, South Korea, Winter Olympics, Olympics, Sport

The crowning moment of any opening ceremony: the final leg of the torch relay and the lighting of the Olympic caldron. Inbee Park, the golfer, is one of the final torchbearers.

కన్నుల పండువగా ప్రారంభమైన వింటర్ ఒలంపిక్స్

Posted: 02/09/2018 08:56 PM IST
Winter olympics 2018 opening ceremony yuna kim lights the torch

దక్షిణకొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో ఎముకలు కొరికే చలిలో శీతాకాల ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయి. ప్యాంగ్‌చాంగ్‌ ఒలింపిక్‌ స్టేడియంలో కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు, బాణసంచా వెలుగుల మధ్య వింటర్‌ ఒలింపిక్స్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జే యిన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మొత్తం 92 దేశాల నుంచి జట్లు ఈ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నాయి. ప్రతి దేశానికి చెందిన జట్టు ఆటగాళ్లు వేడుకల్లో పాల్గొన్నారు. తమ జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని రెట్టించిన ఉత్సాహంతో క్రీడాకారులు స్టేడియంలో సందడి చేశారు. స్కీయింగ్‌, స్కేటింగ్‌, లుజ్‌, ఐస్‌ హాకీ సహా 15  క్రీడల్లో 102 ఈవెంట్లలో నిర్వాహకులు పోటీలు నిర్వహించనున్నారు. భారత్‌ నుంచి ఇద్దరు క్రీడాకారులు శివ్‌కేశవన్‌, జగదీశ్‌ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 25 వరకు వింటర్‌ ఒలింపిక్స్‌ జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles