WBBL: Pooja Vastrakar joins Brisbane Heat బిగ్ బాష్‌ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్‌తో భారత క్రికెటర్ ఒప్పందం.!

Pooja vastrakar signs with brisbane heat in the wbbl

Pooja Vastrakar, Brisbane Heat, WBBL, Indian cricketer, Indian cricket allrounder, indian woman cricketer, Brisbane hierarchy, Australia tour, women's 50-over World Cup, New Zealand, Poonam Yadav, Sydney Thunder, Smriti Mandhana, Sophia Dunkley, cricket news, sports news

Allrounder Pooja Vastrakar has become the latest India women's player to commit to the WBBL, signing with Brisbane Heat. Vastrakar caught the attention of WBBL clubs with her outstanding performances on India's tour of Australia late last year and followed that up with some excellent performances with both bat and ball in the women's 50-over World Cup in New Zealand earlier this year.

బిగ్ బాష్‌ లీగ్‌ లోకి భారత ఆల్‌ రౌండర్‌..! బ్రిస్బేన్ హీట్‌తో ఒప్పందం..!

Posted: 07/28/2022 09:23 PM IST
Pooja vastrakar signs with brisbane heat in the wbbl

భారత క్రికెటర్లు ప్రపంచ ఛాంపియన్స్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక మహిళల జట్టు కూడా అదే స్థాయి ఆటగాళ్లన్న విషయాన్ని లో ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్ బాష్ లీగ్-2022లో తొలి సారి ఆడనుంది. ఈ మెరకు  బ్రిస్బేన్ హీట్‌తో పూజా తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా  వేదికగా బ్రిస్బేన్ హీట్‌ వెల్లడించింది. కాగా న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ అమేలియా కెర్ తర్వాత బ్రిస్బేన్ హీట్‌కు పూజా రెండో విదేశీ క్రికెటర్‌ కావడం గమనార్హం.

గత ఏడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు తరపున వస్త్రాకర్ అద్భుతంగా రాణించింది. అదే విధంగా ఈ ఏడాది న్యూజిలాండ్‌ వేదికగా జరగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ పూజా తన ప్రదర్శనతో అకట్టుకుంది. వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన పూజా.. 156 పరుగులతో పాటు 10 వికెట్లు పడగొట్టింది. ఇక కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022కు ప్రకటించిన భారత జట్టులో పూజా భాగంగా ఉంది. అయితే ఆమె కరోనా బరిన పడడంతో ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు దూరం కానుంది.

ఇప్పటికే భారత స్టార్‌ మహిళా క్రికెటర్లు బిగ్‌ బాష్‌ లీగ్‌లో భాగమయ్యారు. వారిలో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్‌), షఫాలీ వర్మ, రాధా యాదవ్‌ (సిడ్నీ సిక్సర్స్‌) తరపున ఆడగా..  రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) హర్మన్‌ప్రీత్ కౌర్ ( మెల్ బోర్న్ రెనెగేడ్స్ ), రాధా యాదవ్ ( సిడ్నీ సిక్సర్స్‌) తరపున ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ఇక వీరి సరసన పూజా వస్త్రాకర్ కూడా చేరిపోయింది. దీంతో ఎనమిది మంది భారత మహిళా క్రికెటర్లకు బిగ్ బాష్ లీగ్ లో స్థానం లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles