భారత క్రికెటర్లకు విదేశాల్లో అవకాశాలు కలిసివస్తున్నాయి. కౌంటీ క్రికెట్ కు పేరెన్నిక కాబడ్డ ఇంగ్లండ్ లో మరో భారత పేస్ బౌలర్‌కు అవకాశం దక్కింది. 29 ఏళ్ల ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ ‘కెంట్’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్లో 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 5 వన్డేలలో అతను ‘కెంట్’కు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ టీమ్‌కు ఆడనున్న రెండో భారత క్రికెటర్ సైనీ. తాజా సీజన్లో కౌంటీలు ఆడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది.
ఇప్పటికే పుజారా, సుందర్, కృనాల్, ఉమేశ్ యాదవ్ ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌కు 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన సైనీ మూడు ఫార్మాట్లలో కలిపి 23 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. అతను జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు ఏడాదవుతోంది. చరిత్రాత్మక ‘బ్రిస్బేన్ టెస్టు’ విజయం తర్వాత సైనీకి మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more