Short tenure as captain big disappointment says sachin

Short tenure as captain big disappointment, Indian bating legend sachin tendulkar, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, sachin tendulkar, Live Scores, Live Updates,

Sachin Tendulkar today revealed that not getting a long stint as India’s cricket captain was a disappointment he found tough to overcome given the number of challenges he endured.

కెప్టన్ గా తక్కువకాలం వున్నందుకు బాధపడుతన్నా..

Posted: 03/13/2015 09:18 PM IST
Short tenure as captain big disappointment says sachin

అతను అభిమానులకు క్రికెట్ దేవుడు.. దేశానికి బ్యాటింగ్ దిగ్గజం.. అంతర్జాతీయ క్రికెట్లో అతని 24 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేక విజయాలు, అనుకోని, ఊహించని మైలురాళ్ల చేరాయి. ఇక మరెవ్వరికీ అందుకోలేని స్థాయిలో ఆయన మైలురాళ్లు వున్నాయి. ఎందరెందరో అందుకున్న అనేక రికార్డులను ఆయన తన పేరున తిరగరాసుకున్నాడు. అయన సచిన్ టెండుల్కర్. అందుకనే ఆయనకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న బిరుదాంకితుడిని చేసింది.

ఎదిగే కొద్ది ఒదిగి వుండాలన్న చందనాకి నిలువెత్తు నిదర్శనమే సచిన్ టెండుల్కర్. అయితే ఆయన కూడా ఒక్క అంశంలో భాధపడుతున్నాడు. అదే జట్టు సారధిగా కొనసాగిన అంశంలో ఆయన తన భాధను వ్యక్తం చేశారు. 1996లో 17 మ్యాచ్ లకు సారధిగా వ్యవహరించిన సచిన్.కు వెనువెంటనే ఆ పగ్గాలు దూరమయ్యాయి. రెండు పర్యాయాలు స్వల్ప వ్యవధిలో మాత్రమే ఆయన జట్టుకు సారధిగా వ్యవహరించాడు. ఈ విషయమే ఇప్పడు సచిన్ ను భాధపడేలా చేసింది. తాను సారధి పగ్గాలను చేతబూనిన సయంలో జట్టు ఆటతీరు సరిగా లేదని, విమర్శలను ఎదుర్కోందని ఈ నేపథ్యంలో తనకు పగ్గాలు మరోకరి చేతికి అందయాని అయాన తన భాదను వ్యక్తం చేశారు. ఇలా రెండు పర్యాయాలు జరిగిందని సచిన్ ఓ జాతీయ మీడియాకు చెప్పారు.

కాగా జట్లుపై కెప్టెన్ గా. ఏదో చేస్తారనుకోవడంపై కూడా ఆయన తన వివరణను ఇచ్చారు. కెప్టెన్ కీలక సమయాల్లో మాత్రమే ఫీల్డిండ్ లో వున్నప్పుడు మాత్రమే తన మార్పులు చేర్పులు చేయగలరని అంతేకాని, క్రీడాకారులందపైనా జట్టు గెలుపు బాధ్యతలు వుంటాయన్న విషయాన్ని మరువరాదన్నారు. బ్యాట్స్ మెన్లు మైదానంలోకి వెళ్లి స్కోరు చేయాడానికి, కెప్టెన్ కు సంబంధమే లేదన్నారు. ఈ ఒక్క అంశం తప్ప తన సుదీర్ఘ క్రికెట్ కెరీల్ లో మరే విషయంలోనూ తాను కలత చెందలేదన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Indian captain  sachin tendulkar  

Other Articles