అతిలోక సుందరిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి.. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే! ఆ సినిమా విజయం సాధించడంతో ఈమెకు మళ్లీ డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కొందరు దర్శకనిర్మాతలు భారీ పారితోషికాలు సమర్పించుకునిమరీ ఈమెను ప్రత్యేక పాత్రలకోసం తమ సినిమాల్లో తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమెకు ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ‘పులి’ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించే ఆఫర్ వచ్చింది. ఈ చిత్రంలోనే శ్రీదేవి లిప్ లాక్ సన్నివేశాలు వున్నాయంటూ ఇప్పుడు కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.
సోషియో ఫాంటసీ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ‘పులి’ చిత్రంలో శ్రీదేవి రాణిగా నటిస్తోంది. ఈమెకు జంటగా కన్నడ సూపర్ స్టార్ సుదీప్ రాజుగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరిందని, వీరిమధ్య లిప్ టు లిప్ చుంబనాల దృశ్యాలు కూడా వున్నాయంటూ వార్తలు జోరుగా సాగుతున్నాయి. స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు ఆ లిప్ లాక్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగిందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే.. ఈ విషయంపై ఆ మూవీ యూనిట్ బృందం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనను వెలువడించలేదు. ఒకవేళ ఈ గాసిప్స్ నిజమే అయితే.. యూత్ ని కేక పుట్టిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ చిత్రంలో హన్సిక, శృతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటుడు ప్రభు.. విజయ్ కి గురువుగా నటిస్తున్నారని తెలుస్తోంది. శింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అన్నట్టు.. శ్రీదేవి ఈ చిత్రంలో నటిస్తున్న కథానాయికల కంటే అధిక పారితోషికం పుచ్చుకుంటున్నారని సమాచారం!
AS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more