సల్లూ భాయ్ కి ఊరట, అక్రమాయుధాల కేసులో నిర్దోషే... | Benefit Of Doubt Salman freed.

Salman khan acquitted in illegal arms case

Salman Khan, Jodhpur court, Salman Arms Act Case, Salman Illegal weapon case, Salman Khan Jodhpur Court, Salman Khan acquit, Salman Khan third case, Salman Khan Black Buck case, Salman Khan 1998 case, Salman Khan Acquittal

Salman Khan in Jodhpur To Hear Verdict In Arms Act Case. Salman Khan Given 'Benefit Of Doubt', Freed In 1998 Arms Act Case.

క్లీన్ ఖాన్: అక్రమాయుధాల కేసులో ఊరట

Posted: 01/18/2017 12:08 PM IST
Salman khan acquitted in illegal arms case

ఉత్కంఠతకు తెరదించుతూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు ఊరట ఇచ్చింది. అక్రమాయుధాల కేసులో ఈ స్టార్ హీరో నిర్దోషి అని బుధవారం తీర్పు ఇచ్చింది. అనుమతి లేకుండా మారణాయుధాలు కలిగి ఉండటం, వినియోగించటం లాంటి నేరాల కింద గతంలో సల్మాన్ ఖాన్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

1998 అక్టోబర్లో కృష్ణ జింకను వేటాడిన నేరంలో సల్మాన్ పై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు కేసుల్లో ఇప్పటికే సల్మాన్ నిర్దోషి అని రుజువు కావటంతో కోర్టు కొట్టేసింది. ఇక ఇప్పుడు మూడో కేసులో కూడా సల్లూ భాయ్ కే మద్ధతుగా వెలువడింది. అనుమతి లేకుండా .22 రైఫిల్, .32 రివాల్వర్ కలిగి ఉన్న కేసులో జోద్పూర్ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది..

కాగా, తీర్పు సందర్భంగా కోర్టుకు హాజరయ్యేందుకు సల్మాన్ ప్రత్యేక విమానంలో జోద్పూర్ రాగా, అతని వెంట సోదరి అల్వీరా, కొంత మంది లాయర్లు ఉన్నారు. కేసుకు సంబందించి ఏప్రిల్ 2006లో ఒకసారి తరువాత ఆగస్టు 2007 కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించాడు కూడా. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం జనవరి 9న ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ముగిసాయి. నేరం రుజువైతే ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే కోర్టు మాత్రం కేసు నుంచి విముక్తి వెలువరించింది. తుది తీర్పు వెలువడిన వెంటనే సల్మాన్ కు ట్విట్టర్ లో పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  illegal arms case  Jodhpur Court  Acquittal  

Other Articles